Lemon Water: నిమ్మకాయ నీళ్లు తాగడం వలన నిజంగానే బరువు తగ్గుతారా ? అసలు విషయాలు తెలుసుకోండి..

వేసవిలో నిమ్మకాయ నీళ్లు (Lemon Water) ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలసటను తగ్గించడమే కాకుండా.. డీహైడ్రేషన్‏కు గురికాకుండా చేస్తుంది.

Lemon Water: నిమ్మకాయ నీళ్లు తాగడం వలన నిజంగానే బరువు తగ్గుతారా ? అసలు విషయాలు తెలుసుకోండి..
Lemon

Updated on: Apr 19, 2022 | 6:21 PM

వేసవిలో నిమ్మకాయ నీళ్లు (Lemon Water) ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలసటను తగ్గించడమే కాకుండా.. డీహైడ్రేషన్‏కు గురికాకుండా చేస్తుంది. చిన్న, పెద్ద తేడా లేకుండా నిమ్మకాయ నీళ్లు తీసుకోవచ్చు. అంతేకాకుండా.. వేసవిలో నిమ్మకాయ నీళ్లు జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా.. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. అయితే నిమ్మకాయ నీళ్లు బరువు తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని అందరికీ తెలిసిన విషయమే. కానీ నిమ్మకాయ నీళ్లు నిజాంగానే బరువు తగ్గిస్తాయా ? అనే సందేహాలు కూడా చాలా మందిలో ఉన్నాయి. ఆరోగ్యరేఖ పరిశోధన ప్రకారం.. ఒక గ్లాసు నీటిలో సగం నిమ్మకాయ రసం తీసుకుంటే.. అందులో 5 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఆరెంజ్, ఇతర డ్రింక్స్‏తోపాటు.. దీనిని తక్కువ కేలరీలు ఉంటాయి. అందుకే నిమ్మరసం తీసుకోవడం వలన శరీరానికి తక్కువ మొత్తంలో కేలరీలు అందుతాయి. దీంతో బరువు పెరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది..
నిమ్మ నీరు శరీరానికి నీటిని వేగంగా సరఫరా చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. అంతేకాదు శరీరాన్ని త్వరగా హైడ్రేట్ చేస్తుంది. శరీరంలో మంచి హైడ్రేషన్ ఉన్నప్పుడు, శరీరంలో కొవ్వు విచ్ఛిన్నం జరుగుతుందని పరిశోధనలు కనుగొన్నాయి. దీని ద్వారా శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవచ్చు.

జీవక్రియను పెంచుతుంది
నిమ్మకాయ నీళ్లు తాగడం వల్ల శరీరంలో మెటబాలిజం మెరుగ్గా పని చేస్తుందని.. దీని వల్ల ఆకలి తగ్గుతుందని పరిశోధనలలో తేలింది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

ఆకలిని తగ్గిస్తుంది..
నిమ్మరసం సాధారణ నీటి కంటే ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. ఇందులో క్యాలరీలు కూడా తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడం సులభం అవుతుంది.

బరువు తగ్గించడంలో సహాయపడే..
ఒక పరిశోధనలో ఎక్కువ నీరు తీసుకోవడం లేదా నిమ్మరసం తాగే స్త్రీలు ఇతరులకన్నా వేగంగా బరువును తగ్గుతున్నారని నిపుణులు కనుగొన్నారు.

పోషక విలువలు..
నిమ్మకాయలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి.

నిమ్మకాయ బరువును తప్పనిసరిగా తగ్గించదు..
నిమ్మరసం బరువు తగ్గించడంలో సహయపడుతుందని ఇటీవల ఓ పరిశోదనలో తేలింది. కానీ.. సాధారణ నీటి కంటే మరిన్ని ప్రయోజనాలు మాత్రం కలిగి ఉండదు. ఇతర డ్రింక్స్ తో పోలిస్తే నిమ్మరసం తాగినప్పుడు బరువు తగ్గుతారు. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. జ్యూస్, లేదా ఇతర అధిక కేలరీ డ్రింక్స్ తో పోలిస్తే నిమ్మరసం బరువు పెరగడాన్ని తగ్గిస్తుంది.

గమనిక :- ఈ కథనం కేవలం ఆరోగ్యన నిపుణులు.. ఇతర వెబ్ సైట్స్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని టీవీ9 తెలుగు దృవీకరించలేదు. అమలు చేయడానికి ముందు వైద్యులను సంప్రదించాలి.

Also Read: The Kashmir Files: ఓటీటీలోకి ది కాశ్మీర్ ఫైల్స్ ?.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..

Upasana Konidela: గోల్డెన్ టెంపుల్‏లో ఉపాసన సందడి.. చరణ్‏కు బదులుగా నేనొచ్చానంటూ పోస్ట్..

Siddarth: స్పీడ్ పెంచిన యంగ్ హీరో.. కొత్త సినిమా అనౌన్స్ చేసిన సిద్ధార్థ్..

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట నుంచి స్పెషల్ అప్డేట్.. చివరి దశలో షూటింగ్.. మాస్ సాంగ్‏తో ఫైనల్..