Turmeric, Lemon, Ginger Water: శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి మంచి ఆహారం, పానీయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే అనారోగ్యకరమైన ఆహారంతో అనేక వ్యాధులు మనల్ని చుట్టుముట్టే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పసుపు, నిమ్మరసం, అల్లం నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందన్న విషయం మీకు తెలుసా..? తెలియకపోతే తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నీటని తీసుకోవడం ద్వారా రోగాల ముప్పును తగ్గించుకోవచ్చు. అదే సమయంలో దీన్ని తీసుకోవడం ద్వారా బరువును కూడా సులభంగా తగ్గించుకోవచ్చు. పసుపు, నిమ్మ, అల్లం నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపు, నిమ్మ, అల్లం నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..
రోగనిరోధక శక్తిని పెంచుతుంది: శరీరంలో రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితుల్లో పసుపు, నిమ్మ, అల్లం నీటిని తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి ఉన్నందున, పసుపు శరీరంలోని వ్యాధులతో పోరాడడంలో సహాయపడుతుంది. కావున దీనిని ప్రతిరోజూ తీసుకోవడం చాలా ముఖ్యం.
మూత్రపిండాలు – కాలేయానికి మేలు: పసుపు, నిమ్మ, అల్లం నీరు కాలేయం, మూత్రపిండాల నుంచి విషాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. పసుపు, నిమ్మ, అల్లం కాలేయాన్ని నిర్విషీకరణ చేయడానికి పని చేస్తాయి. దీని కోసం ప్రతిరోజూ ఉదయం ఈ పానీయం తీసుకోవచ్చు.
బరువు తగ్గుతుంది: పసుపు, నిమ్మ, అల్లం కలిపిన నీటిని రోజూ తాగడం వల్ల బరువు క్రమంగా తగ్గుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీర రోగ నిరోధక శక్తిని పెంపొందించి బరువు తగ్గించడంలో తోడ్పడతాయి.
పసుపు, నిమ్మ, అల్లం నీటిని ఈ విధంగా తయారు చేయండి..
అల్లం, పసుపు, నిమ్మకాయ నీరు సిద్ధం చేయడానికి ముందుగా ఒక గ్లాసు నీరు తీసుకుని, అందులో అల్లం ముక్క వేసి బాగా మరిగించాలి. మరిగేటప్పుడు అందులో ఒక టీస్పూన్ నిమ్మకాయ, అర టీస్పూన్ పసుపు వేసి కలపాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత లేదా గోరువేచ్చగా ఉన్నప్పుడు టీ లాగా తాగండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం