Ragi Idli Benefits: ఇడ్లీ పిండి వాడకుండా వెజిటబుల్ ఇడ్లీ.. రోజూ బ్రేక్ ఫాస్ట్ గా తినొచ్చు!!

| Edited By: Ravi Kiran

Aug 27, 2023 | 11:30 AM

సాధారణంగా రోజూ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, దోసె, గారె, ఉప్మా వగైరా వెరైటీలు తింటుంటారు. కానీ ఇడ్లీతో సహా వీటిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయని, ఆరోగ్యానికి అంతమంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి బ్రేక్ ఫాస్ట్ లో ఏం తినాలని ఆలోచిస్తున్నారా? ఇడ్లీపిండి వాడకుండా.. ఈ వెజిటబుల్స్ ఇడ్లీలు ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా ఈజీ. ఈ వెజిటబుల్ రాగి ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Ragi Idli Benefits: ఇడ్లీ పిండి వాడకుండా వెజిటబుల్ ఇడ్లీ.. రోజూ బ్రేక్ ఫాస్ట్ గా తినొచ్చు!!
Ragi Idli Benefits
Follow us on

సాధారణంగా రోజూ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, దోసె, గారె, ఉప్మా వగైరా వెరైటీలు తింటుంటారు. కానీ ఇడ్లీతో సహా వీటిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయని, ఆరోగ్యానికి అంతమంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి బ్రేక్ ఫాస్ట్ లో ఏం తినాలని ఆలోచిస్తున్నారా? ఇడ్లీపిండి వాడకుండా.. ఈ వెజిటబుల్స్ ఇడ్లీలు ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా ఈజీ. ఈ వెజిటబుల్ రాగి ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వెజిటబుల్ రాగి ఇడ్లీల తయారీకి కావలసిన పదార్థాలు:

రాగి పిండి – 1 కప్పు, బొంబాయిరవ్వ – 1 కప్పు, పెరుగు – 1 కప్పు, వంటసోడా – పావు టీస్పూన్, సన్నగా, చిన్నగా తరిగిన క్యాప్సికం 1, తరిగిన క్యారెట్ – 1, తరిగిన కొత్తిమీర కొద్దిగా, నూనె – 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు – 1/2 టీ స్పూన్, చిన్నగా తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – రుచికి తగినంత.

ఇవి కూడా చదవండి

తయారీ విధానం:

ఒక గిన్నెలో రాగిపిండిని తీసుకోవాలి. అందులో పైన పేర్కొన్న క్వాంటీటీలో రవ్వ, పెరుగు, ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని అరగంటసేపు నానబెట్టాలి. ఇందులో వంటసోడా, క్యాప్సికం ముక్కలు, కొత్తిమీర, క్యారెట్ తురుము వేసి కలుపుకోవాలి.

కళాయిలో తాలింపుకు సరిపడా నూనెవేసి వేడిచేయాలి. అందులో ఆవాలు, కరివేపాకు వేసి వేయించి.. వాటిని ముందు కలుపుకున్న పిండిలో వేసి కలపాలి. పిండి గట్టిగా ఉంటే.. కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. ఇడ్లీకుక్కర్ లో నీళ్లుపోసి మూతపెట్టి వేడిచేయాలి. ఇడ్లీ ప్లేట్లలో పిండిని వేసుకుని.. ఇడ్లీ పాత్రలో పెట్టి మూతపెట్టాలి. వీటిని లో ఫ్లేమ్ లో 15 నిమిషాలపాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

ఇడ్లీ ప్లేట్లను బయటకు తీసి 5 నిమిషాలపాటు అలాగే ఉంచాలి. తర్వాత ఇడ్లీలను తీసి సర్వ్ చేసుకోవాలి. వీటిని ఏ చట్నీతోనైనా తినవచ్చు. బ్రేక్ ఫాస్ట్ లో వీటిని తింటే.. బరువు కంట్రోల్ లో ఉంటుంది. గ్యాస్ సమస్యలు ఉండవు. వీటిలో వాడింది కూరగాయలు, రాగి పిండి కాబట్టి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి