Ajwain Leaves: మీ ఇంట్లో పిల్లలున్నారా.. అయితే ఈ మొక్క తప్పనిసరిగా ఉండాల్సిందే..ఎన్నో వ్యాధులకు చక్కని దివ్య ఔషధం

|

Aug 20, 2021 | 11:48 AM

Ajwain Leaves: భారతీయుల వంటిల్లే ఓ ఔషధాల గని. పోపుల పెట్టెలోని ఎన్నో పదార్ధాలు అనారోగ్యాలను నివారిస్తాయి. ప్రతి ఇంట్లో ఉండాల్సిన వస్తువు వాము గింజలు అయితే..

Ajwain Leaves: మీ ఇంట్లో పిల్లలున్నారా.. అయితే ఈ మొక్క తప్పనిసరిగా ఉండాల్సిందే..ఎన్నో వ్యాధులకు చక్కని దివ్య ఔషధం
Ajwain Leaves
Follow us on

Ajwain Leaves: భారతీయుల వంటిల్లే ఓ ఔషధాల గని. పోపుల పెట్టెలోని ఎన్నో పదార్ధాలు అనారోగ్యాలను నివారిస్తాయి. ప్రతి ఇంట్లో ఉండాల్సిన వస్తువు వాము గింజలు అయితే.. ప్రతి ఇంటి పెరట్లో కచ్చితంగా ఉండవలసిన మొక్కలలో వాము ఒకటి. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్నవారు ఈ వాము మొక్కలు పెంచుకోవడంతో ఎన్నో ప్రొబ్లెమ్స్ నుంచి ఈజీగా బయటపడతారు. ఇక వాము గింజలను వంటకాలతో పాటు పలురకాల పానీయాలు తయారీకోసం ఉపయోగిస్తారు. వాము చక్కని సువాసనను అందిస్తుంది. వాములోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాము గింజలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అదేవిధంగా వాము మొక్క ఆకులు అంతే మేలు చేస్తాయి. అందుకనే కనీసం మూడు నెలలకు ఒక్కసారి అయినా వాము పొడి కాని వాము ఆకు కాని వాడితే ఉదరం శుభ్ర పడుతుంది. వాము ఆకు అప్పుడప్పుడు వాడితే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెప్పారు. ఈ వామకులో విశిష్ట లక్షణాలు ఉన్నాయి.. వాము ఆకు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

*చిన్న పిల్లలకు అజీర్తితో కడుపునొప్పికి వాము ఆకు మంచి ఔషధం. వాము ఆకు రసంలో తేనె కలిపి చిన్న పిల్లలకు ఇస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇక తరచుగా చిన్న పిల్లలు దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్స్ వంటివి వాటితో ఇబ్బంది పడుతుంటే.. వాము ఆకు నీరు మంచి మెడిసిన్.

*కాలిన గాయాలు, మచ్చలను వాము తగ్గిస్తుంది. దీనిలో యాంటీ సెప్టిక్ గుణాలు గాయాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

*వాము ఆకు తలనొప్పి తగ్గించడంలో ఔషధంగా పనిచేస్తుంది. వాము ఆకు రసాన్ని తలనొప్పి ఉన్న చోట రాస్తే త్వరగా తగ్గుతుంది..

*ఏవైనా పురుగులు శరీరంపై కుడితే వాము ఆకు ను రుద్దినా విషం బయటకు వస్తుంది.

*వాము ఆకులను నమిలితే జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

*వికారం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలకు వాము ఆకు చక్కటి పరిష్కారం.

ఈ వాముకుని ఔషధంగానే కాదు ఆహారపదార్ధాల్లో కూడా ఉపయోగించవచ్చు. వాము ఆకుతో బజ్జీలు వేసుకొని తినవచ్చు.. వాము ఆకు తో పెరుగు పచ్చడి చేసుకుని తింటే రుచికరంగా ఉండడం తో పాటు అజీర్తి సమస్యలు కూడా దూరమవుతాయి.. అలాగే వాము ఆకు రసం కూడా పెట్టుకోవచ్చు.. ప్రతి ఇంటి పెరట్లో వాము మొక్క ఉంటే పిల్లలతో పాటు పెద్దలకు కూడా ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది.

Also Read:  శుక్రవారం లక్ష్మీదేవిని ఈ స్త్రోత్రంతో స్తుతిస్తే.. దారిద్య బాధల తీరి సుఖసంతోషాలతో ఉంటారట