పట్టుమని పదేళ్ల వయసు కూడా ఉండని పిల్లల నుంచి.. పెద్దల వరకూ నూటికి 80 శాతం మంది కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న వయసులోనే కంటి చూపు మందగించడంతో సోడా బుడ్డంత కళ్లద్దాలు తగిలించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కళ్లజోళ్లు కాకపోతే.. లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ప్రతి నలుగురిలో ఇద్దరికి ఐ సైట్ ఖచ్చితంగా ఉంటోంది. రోజురోజుకూ కళ్లద్దాలు ఉపయోగించేవారి సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఎన్ని ఆస్పత్రిలకు తిరిగినా కళ్లకు అద్దాలు ఉండాల్సిందే. మందుల ద్వారా కాకుండా.. నేచురల్ గా, ఆరోగ్యకరంగా కంటి చూపును మెరుగుపరిచే ఓ చిట్కా ఉంది. దీనిని క్రమం తప్పకుండా వాడితే.. ఖచ్చితంగా మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఇక మీకు కళ్లద్దాలతో పనుండదు. మరి ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
బాదంపప్పు, సోంపు గింజలు, పటిక బెల్లాన్ని సమపాళ్లలో వేరువేరుగా తీసుకోవాలి. బాదంపప్పు, సోంపు గింజలను వేరువేరుగా దోరగా వేయించి.. చల్లారనివ్వాలి. రెండుంటిని కలిపి మిక్సీ జార్ లో వేసి అందులోనే పటికబెల్లం వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని గాలి తగలకుండా గాజుసీసాలో నిల్వచేసుకోవాలి. రోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసుపాలల్లో ఈ పొడిని టీ స్పూన్ మోతాదులో కలుపుకుని తాగాలి.
పెద్దవయసు వారైతే ఒక గ్లాసు పాలల్లో రెండు టేబుల్ స్పూన్ల పొడిని కలుపుకుని తాగాలి. కంటిచూపు మందగించడం (ఐ సైట్) ఎక్కువగా ఉన్నవారు ఈ చిట్కాను రెండుపూటలా పాటించాలి. పిల్లలైతే ఒక్కపూట తాగితే చాలు. కంటి సంబంధిత సమస్యలతో పాటు.. ఈ పొడిలో సోంపు గింజల్ని ఉపయోగించాం కాబట్టి జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే బాదంపొడి పిల్లల్లో చురుకుదనాన్ని పెంచుతుంది. ఈ చిట్కాను పాటించడం మొదలు పెట్టిన వారంరోజుల్లోనే మీరు మార్పును గమనిస్తారు. ఒక్క నెల రోజుల పాటు క్రమం తప్పకుండా ఇలా తాగితే.. మీ కంటిచూపు మెరుగు పడుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి