Health Tips: పసుపు కలిపిన పాలు తాగుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..

|

Jun 27, 2022 | 9:33 PM

మన దేశ పాక శాస్త్రంలో పసుపుకు ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో ఔషధ గుణాలు నిండిన పసుపు పూర్వ కాలం నుంచి వినియోగంలో ఉంది. జలుబు, దగ్గు, ఫ్లూ, గాయాలు, కీళ్ల నొప్పులు ఇతర వ్యాధుల చికిత్సలో పసుపును..

Health Tips: పసుపు కలిపిన పాలు తాగుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..
Turmeric Milk
Follow us on

Turmeric Milk Benefits: మన దేశ పాక శాస్త్రంలో పసుపుకు ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో ఔషధ గుణాలు నిండిన పసుపు పూర్వ కాలం నుంచి వినియోగంలో ఉంది. జలుబు, దగ్గు, ఫ్లూ, గాయాలు, కీళ్ల నొప్పులు ఇతర వ్యాధుల చికిత్సలో పసుపును వినియోగించడం అనాదిగా కొనసాగుతోంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో, గుండె సంబంధిత సమస్యల నుండి రక్షించడంలో కూడా పసుపు పాత్ర కీలకమైనది. చిటికెడ్‌ పసుపును గ్లాసుడు పాలలో కలిపి తాగితే వర్షాకాలంలో వేధించే ఆరోగ్య సమస్యలు ఇట్టే పారిపోతాయి.

క్యాన్సర్ నివారిని
పసుపులో యాంటీ కార్సినోజెనిక్ గుణాలు అధికంగా ఉంటాయి. అనేక అధ్యయనాల ప్రకారం, పసుపును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణాలు, కణితుల పెరుగుదల ఆగిపోవడానికి ఉపయోగపడుతుంది.

జలుబు-దగ్గు పరార్‌!
యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగిన పసుపును పాలల్లో కలిపుకుని తాగితే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. పసుపు కలిపిన పాలు గొంతు నొప్పిని కూడా నివారిస్తుంది.

ఇవి కూడా చదవండి

నొప్పిని తగ్గిస్తుంది
పని ఒత్తిడి, ఇతర కారణాల వల్ల బాడీ పెయిన్, బ్యాక్ పెయిన్ వంటి సమస్యలు పట్టిపీడిస్తాయి. అటువంటి వారు పసుపు పాలు తరచుగా తాగడం వల్ల వెన్నెముక, కీళ్లను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. నొప్పిని తగ్గిస్తుంది.

బరువు తగ్గడంలో సహాయపడుతుంది
పసుపు పాలు తరచుగా తాగడం వల్ల పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. ఇది వేగంగా బరువు తగ్గించడంలోనూ సహాయపడుతుంది. బరువును అదుపులో ఉంచాలంటే.. మీ డైట్‌ చార్ట్‌లో పసుపు పాలను కూడా చేర్చుకోవచ్చు. ఇది జీవక్రియను కూడా వేగవంతం చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.