Turmeric In Monsoon: పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అంటే శరీరంలో పెరిగే బాక్టీరియా, ఫంగస్, వాపు లాంటి వాటిని పసుపు నాశనం చేస్తుంది. వర్షాకాలంలో ఈ మూడు సమస్యలూ సాధారణం కంటే ఎక్కువగా వేధిస్తాయి. ఎందుకంటే వాతవరణం, తేమ కారణంగా ఈ సీజన్‌లో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ అన్నీ చాలా వేగంగా పెరుగుతాయి. అందువల్ల ప్రత్యేకించి ఈ కాలంలో ఆరోగ్యంగా ఉండటానికి పసుపు వినియోగం చాలామంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే.. ఆహార పదార్థాల్లో, ద్రవపదార్థాల్లో పసుపు వినియోగం ద్వారా పలు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఇన్ఫెక్షన్, జలుబు, చర్మవ్యాధుల సమస్య ఉంటే పసుపును క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చని పేర్కొంటున్నారు.
పసుపు ఎలా తీసుకోవాలి?
పసుపు పిత్త, క్యాన్సర్ నిరోధకం. అందువల్ల పాలతో కలిపి తీసుకుంటారు. వర్షాకాలం ప్రారంభం నుంచి పసుపు పాలు తీసుకోవడం చాలా మంచిది. అయితే.. శ్రావణ మాసంలో కూడా ఈ పాలను తాగవచ్చని పేర్కొంటున్నారు.
వర్షాకాలంలో పాలు ఎప్పుడు తాగవచ్చు?
వర్షాకాలంలో పాలు తాగకూడదని ఎక్కడో ఒకచోట వినడం, లేదా చదివి ఉంటారు. శ్రావణ మాసంలో పాలు తాగకూడదనేది నిజమే.. అయినా భాద్రపద మాసంలో పాలు తీసుకోవచ్చు. వాస్తవానికి, రుతుపవనాలు రెండు నెలలు ఉంటాయి. అందుకే ఈ మాసంలో పసుపు పాలను తీసుకోవచ్చు .
పసుపు తీసుకునే విధానం ఏమిటి?
రాత్రి భోజనం చేసిన రెండు గంటల తర్వాత అర టీస్పూన్ పసుపును ఒక గ్లాసు పాలలో కలిపి తాగాలి. పాలలో చక్కెర లేదా బెల్లం ఉపయోగించుకోవాలి. పసుపును ఉదయం పూట తీసుకోవాలంటే ఈ పద్ధతిని అనుసరించాలి. భోజనం చేసిన రెండు గంటల తర్వాత మాత్రమే పాలు తీసుకోవాలన్న విషయాన్ని గుర్తుంచుకోండి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి