Turmeric Benefits: పసుపు క్యాన్సన్‌ నివారణకు ఉపయోగపడుతుందా..? పరిశోధనలలో కీలక అంశాలు వెల్లడి..!

| Edited By: Anil kumar poka

Nov 01, 2021 | 8:45 AM

Turmeric Benefits: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్‌ కూడా ఒకటి. దీని కారణంగా ఎంతో మంది బలైపోయారు. క్యాన్సర్‌ బారిన పడ్డారంటే బతికే..

Turmeric Benefits: పసుపు క్యాన్సన్‌ నివారణకు ఉపయోగపడుతుందా..? పరిశోధనలలో కీలక అంశాలు వెల్లడి..!
Turmeric
Follow us on

Turmeric Benefits: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్‌ కూడా ఒకటి. దీని కారణంగా ఎంతో మంది బలైపోయారు. క్యాన్సర్‌ బారిన పడ్డారంటే బతికే నమ్మకం తక్కువ ఉంటుంది. ఖరీతైన వైద్యం. క్యాన్సర్‌ బారిన పడిన తొలినాళ్లలో అయితే బతికి బయటపడవచ్చు. ఇక క్యాన్సర్ చికిత్సకోసం ప్రస్తుతం అధునాతన పద్దతులు ఉపయోగిస్తున్నప్పటికీ, మనం నిత్యం సాంప్రదాయబద్ధంగా వినియోగించే వస్తువులతో సైతం క్యాన్సర్ ను నిరోధించవచ్చని పలు పరిశోధనల్లో వెల్లడైంది. ఆ పరిశోధనలు ఇంకా పూర్తి స్ధాయిలో ఓ కొలిక్కి రావాల్సి ఉంది. ముఖ్యంగా మనం నిత్యం వినియోగించే పుసుతో క్యాన్సర్ నివారణ సాధ్యమని శాస్త్రవేత్తలు గుర్తించారు. పసుపులో ఉన్న గుణాల వల్ల ఎన్నో లాభాలున్నాయని చెబుతున్నారు.

పురాతన కాలం నుంచి పసుపు మన జీవితాలలో భాగమైపోయింది. ప్రతి వంటింట్లో ఉండే పసుపులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. తాజాగా వివిధ రకాల క్యాన్సర్‌లకు చికిత్స చేయడానికి, వ్యాధి తీవ్రతను తగ్గించడంలో పసుపు ఏ విధంగా ప్రభావం చూపుతుందనే అంశంపై అనేక పరిశోధన అధ్యయనాలు వేగవంతం చేశారు శాస్త్రవేత్తలు. క్యాన్సర్ అభివృద్ధికి మధ్య సహసంబంధం ఉన్నందువల్ల, పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు వ్యాధితో పోరాడడంలో ప్రయోజనకరంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అమెరికాలోని సౌత్ డకోటా స్టేట్ వర్సిటీ ప్రొఫెసర్ , భారతీయ శాస్త్రవేత్త హేమ చందు తుమ్మల జీర్ణాశయ క్యాన్సర్ చికిత్సలో పసుపును వినియోగించే పద్ధతిని అభివృద్ధి చేసి విజయవంతం అయ్యారు.

క్యాన్సర్‌కు కర్‌క్యుమిన్‌

పసుపులో ఉండే కర్‌క్యుమిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుందని గుర్తించారు. 2019లో న్యూట్రియంట్స్‌ అనే సైంటిఫిక్‌ జర్నల్‌ ప్రచురించిన నివేదికలో పసుపు రొమ్ము క్యాన్సర్ కణాల విస్తరణను నిరోధిస్తుందని, కణితి పెరుగుదల మందగించేలా ఉపయోగపడుతుందని తేల్చారు. అంతేకాకుండా ఊపిరితిత్తులు, పెద్దపేగు, క్లోమం వంటి కొన్ని ఇతర రకాల క్యాన్సర్లకు చికిత్సగా పసుపును వినియోగించడంపై పరిశోధనలు జరుగుతున్నాయని తెల్పింది. టెస్ట్ ట్యూబ్, జంతు అధ్యయనాల్లో మంచి ఫలితాలు వచ్చినట్లు ఈ నివేదిక తెలిపింది. అయితే నేటికి ఈ పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి.

పసుపు క్యాన్సన్‌ నివారణలో అడ్డంకి..

అయితే క్యాన్సర్ వ్యాధి చికిత్సలో పసుపును ఉపయోగించడంలో మరో అడ్డంకి ఏర్పడుతోంది. అదేంటంటే.. పసుపును ఎక్కువ మోతాదులో మానవ శరీరం గ్రహించలేకపోవడం అని నిపుణులు గుర్తించారు. ఈ అడ్డంకిని అధిగమించడానికి ఫార్మకాలజిస్టులు కృషి చేస్తున్నారు. అయితే ఈ పరిశోధనలు విజయవంతం అయ్యేంత వరకు.. పసుపును క్యాన్సర్‌కు చికిత్సగా ఉపయోగించాలంటే పరిశోధనలు పూర్తిస్ధాయిలో ఫలితాలను వెల్లడిస్తే తప్ప కుదరదని చెబుతున్నారు.

పసుపు పాలతో మరిన్ని ప్రయోజనాలు:

► రోగ నిరోధకశక్తిని పెంచుతాయి.
► పసుపు పాలు వైరల్‌ దాడి నుంచి కాలేయాన్ని రక్షిస్తాయి.
► పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ వల్ల కీళ్లు బలపడతాయి.
► ముక్కు దిబ్బడ, తలనొప్పి, ఇతర నొప్పులను తగ్గిస్తుంది.
► కీళ్ల వాపులు, నొప్పులు తగ్గాలంటే పసుపు పాలను క్రమం తప్పక తాగితే ఎంతో ప్రయోజనం.
► రుతుక్రమం వల్ల కలిగే పొత్తి కడుపు, ఇతర ఒంటి నొప్పులను దూరం చేస్తుంది.
► అందుకే కాలేయ సంబంధ పచ్చ కామెర్ల లాంటి వ్యాధులు దరి చేరవు.
► కాలేయంలో చేరే విషకారకాలను హరిస్తుంది.
► పసుపు పాలలో ఉండే పోషకాలు రక్త ప్రసరణను మెరుగుపరిచి
కామెర్లు దరిచేరకుండా కాపాడుతుంది.
► లింఫోటిక్‌ సిస్టమ్‌ను కూడా శుద్ధిచేస్తాయి.
► పసుపులో ఉండే కర్‌క్యుమిన్‌ శరీరంలో వైరస్‌ వృద్ధిని అరికడుతుంది.
► నీటి ద్వారా శరీరంలోకి చేరుకున్న వైరస్‌ త్వరితగతిన రెట్టింపు కాకుండా అడ్డుకుంటుంది.

ఇవి కూడా చదవండి:

Heart Disease: మీకు రోజు జిమ్‌ చేసే అలవాటు ఉందా..? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి..!

Heart Attack: గుండెపోటుకు ముందు కనిపించే లక్షణాలు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? నిపుణులు ఏమంటున్నారు..?