దగ్గు, గొంతునొప్పి భరించలేకపోతున్నారా..! అయితే వీటి గురించి తెలుసుకోండి..

|

Nov 26, 2021 | 7:12 PM

Health News: శీతాకాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో ఆరోగ్య సంబంధిత సమస్యలు అధికంగా వస్తాయి. ఇందులో గొంతు నొప్పి, దగ్గు, ఇతర అలర్జీల ప్రభావం ఎక్కువ. అలాగే పెరుగుతున్న

దగ్గు, గొంతునొప్పి భరించలేకపోతున్నారా..! అయితే వీటి గురించి తెలుసుకోండి..
Sore Throat
Follow us on

Health News: శీతాకాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో ఆరోగ్య సంబంధిత సమస్యలు అధికంగా వస్తాయి. ఇందులో గొంతు నొప్పి, దగ్గు, ఇతర అలర్జీల ప్రభావం ఎక్కువ. అలాగే పెరుగుతున్న కాలుష్యం కూడా అనేక ఆరోగ్య సమస్యలకు కారణం. ఈ పరిస్థితిలో కొన్ని ఇంటి నివారణలను ప్రయత్నించడం ద్వారా వీటి బారి నుంచి బయటపడవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

1. లవంగాలు
గొంతు నొప్పిని తగ్గించడంలో లవంగం బాగా పనిచేస్తుంది. ఒక లవంగం కొద్దిగా రాక్ ఉప్పు తీసుకొని రెండిటిని కలిపి తినాలి. ఇది ఏ సమయంలోనైనా గొంతు నొప్పిని తగ్గిస్తుంది.

2. తులసి
చలికాలంలో గొంతు నొప్పిని తగ్గించాలంటే తులసి చక్కగా పనిచేస్తుంది. ఈ ఆకులతో మరిగించి టీ లా తయారు చేసి తాగితే మంచి ఉపశమనం ఉంటుంది. ఇందులో కొంచెం తేనె కలపండి.

3. నల్ల యాలకులు
గొంతు నొప్పిని నయం చేసేందుకు నల్ల యాలకులు అద్భుతంగా పని చేస్తాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో పొడి దగ్గు, ఇతర గొంతు సంబంధిత సమస్యలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.

4. తేనె, అల్లం
వేడి నీటిలో అల్లం, తేనె కలిపి తాగడం వల్ల దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. అల్లం, తేనె గొంతును శాంతపరుస్తాయి.

5. గోరువెచ్చని నీరు తాగాలి
చలికాలంలో నీరు తక్కువగా తాగుతారు. అందుకే గోరువెచ్చని నీటిని తీసుకోవడం చాలా ముఖ్యం. తద్వారా గొంతు తేమగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది.

6. పసుపు
పసుపు అంటువ్యాధులను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. మీకు గొంతు నొప్పి ఉంటే ఒక కప్పు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ ఉప్పు కలపి తాగితే వెంటనే తగ్గుతుంది.

భారత రాజ్యాంగం గురించి వాస్తవాలు.. 15 ప్రత్యేక విషయాలు తెలుసుకోండి..

Hyderabad‌: ఓటర్లకు గమనిక.. ఈ నెల 27, 28వ తేదీలలో ఓటరు జాబితా సవరణ క్యాంపెయిన్

Post Office: పోస్టాఫీసులో నెలకి 10,000 పెట్టండి..16 లక్షలు పొందండి..