AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెడు కొలెస్ట్రాల్‌ తో టెన్షన్ వద్దు.. ఈ ఫుడ్స్ తింటే అంతా సెట్ అయిపోద్ది..!

మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) పెరగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ద్వారా ఈ సమస్యను అదుపులో పెట్టుకోవచ్చు. ముఖ్యంగా విటమిన్ B సమృద్ధిగా ఉండే కొన్ని ఆహార పదార్థాలు చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు అటువంటి విటమిన్ B రిచ్ ఆహారాల గురించి తెలుసుకుందాం.

చెడు కొలెస్ట్రాల్‌ తో టెన్షన్ వద్దు.. ఈ ఫుడ్స్ తింటే అంతా సెట్ అయిపోద్ది..!
Cholesterol Control
Prashanthi V
|

Updated on: Apr 20, 2025 | 8:35 PM

Share

ఉడికించిన మినుములు, కందిపప్పు, బఠాణీ వంటి పప్పుల్లో విటమిన్ B9 (ఫోలేట్) అధికంగా ఉంటుంది. ఈ పదార్థం రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంతో పాటు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. పప్పులు తినడం వల్ల శరీరానికి అవసరమైన ఫైబర్, ప్రోటీన్ కూడా అందుతుంది. రోజూ ఆహారంలో ఒక్కసారి అయినా పప్పులను చేర్చితే ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతుంది.

కివీ చిన్న పండు అయినప్పటికీ ఇందులో విటమిన్ B12, విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కలిసి గుండెకు శక్తిని అందిస్తూ చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో తోడ్పడతాయి. ప్రతి రోజు కివీ పండు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

పుట్టగొడుగుల్లో విటమిన్ B2 (రిబోఫ్లావిన్), B3 (నయాసిన్), B5 (ప్యాంటోథెనిక్ యాసిడ్), బయోటిన్ వంటి విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో కొవ్వు పదార్థాల సమతుల్యతను కాపాడుతూ చెడు కొలెస్ట్రాల్ తగ్గింపునకు తోడ్పడతాయి.

ప్రతి రోజు ఒక్క యాపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదని ఎందుకు అంటారో ఇప్పుడు అర్థమవుతుంది. యాపిల్‌లో విటమిన్ B13తో పాటు ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని కొవ్వును కరిగించి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

పెరుగులో విటమిన్ B2, B12లు మాత్రమే కాకుండా కాల్షియం కూడా అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంతో పాటు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో యోగర్ట్ చేర్చడం మంచి అలవాటు.

వైట్ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్‌ను తీసుకుంటే విటమిన్ B1, B3, B5, B6 వంటి పోషకాలతో పాటు ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. ఇది బరువు నియంత్రణతో పాటు చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది.

న్యూట్రిషనల్ ఈస్ట్ అనేది ఒక ఆహార పొడి రూపం. ఇందులో విటమిన్ B12, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇది శాకాహారులకు చాలా మంచిది. దీన్ని రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల శక్తి పెరిగి కొలెస్ట్రాల్‌ను సులభంగా తగ్గించవచ్చు.

పాలకూర వంటి ఆకుకూరల్లో విటమిన్ B1, B2తో పాటు ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉండటం, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల శరీర బరువు నియంత్రించబడుతుంది. దీనివల్ల చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది.

పల్లీల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ B గణనీయంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తూ చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో సహాయపడతాయి.

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు, గుండెను రక్షించుకునేందుకు మనం తినే ఆహారంపై దృష్టిపెట్టడం అవసరం. ఈ విటమిన్ B గల ఆహారాలను మీ రోజువారీ డైట్‌లో చేర్చండి. అవి సహజంగా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?