Health Benefits Of Muskmelon: ఖర్బూజతో కలిగే లాభాలు అన్నీఇన్నీ కావు.. హాట్‌ హాట్ సమ్మర్‌లో కూల్‌ కూల్‌గా..

Health Benefits Muskmelon: వేసవి రానే వచ్చింది. మార్చి మొదట్లోనే ఎండలు ఓ రేంజ్‌లో మండి పోతున్నాయి. అయితే సమ్మర్‌ వస్తు వస్తూనే కొన్ని పండ్లను తన వెంట తీసుకొస్తుంది. అలాంటి వాటిలో ఖర్బూజ (Health Benefits Muskmelon) ఒకటి. సాధారణంగా సమ్మర్‌లో రోడుపై ఎక్కడ చూసినా...

Health Benefits Of Muskmelon: ఖర్బూజతో కలిగే లాభాలు అన్నీఇన్నీ కావు.. హాట్‌ హాట్ సమ్మర్‌లో కూల్‌ కూల్‌గా..
Musk Melon Health

Updated on: Mar 16, 2021 | 12:45 AM

Health Benefits Muskmelon: వేసవి రానే వచ్చింది. మార్చి మొదట్లోనే ఎండలు ఓ రేంజ్‌లో మండి పోతున్నాయి. అయితే సమ్మర్‌ వస్తు వస్తూనే కొన్ని పండ్లను తన వెంట తీసుకొస్తుంది. అలాంటి వాటిలో ఖర్బూజ (Muskmelon) ఒకటి. సాధారణంగా సమ్మర్‌లో రోడుపై ఎక్కడ చూసినా ఖర్బూజ పండ్లు, జ్యూస్‌ సెంటర్లు కనిపిస్తుంటాయి. మరి వేసవిలో విరివిగా లభించే ఖర్బూజతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఓసారి తెలుసుకుందామా..

* ఖర్బూజలో విటమిన్‌ కె, ఇ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేస్తుంది. సంతాన లేమితో బాధపడేవారు ఈ పండును తరుచుగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక రక్త ప్రసరణ మెరుగు పరచడంలో కూడా ఈ పండు కీలక పాత్ర పోషిస్తుంది.

* ఇక ఇందులో ఉండే బీటాకెరోటిన్‌ క్యాన్సర్‌ కణాలను తొలగించి, ప్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. తెల్ల రక్త కణాల వృధ్దిలో కూడా ఈ పండు ఉపయోగపడుతుంది.

* వేసవిలో చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో ఒకటైన వడదెబ్బ నుంచి ఖర్బూజ రక్షిస్తుంది. ముఖ్యంగా ఎండలో బయటకి వెళ్లే వారు ఖర్బూజ జ్యూస్‌ తాగడం మంచిది.

* ఖర్భూజలో ఉండే విటమిన్‌ ఎ కంటి సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. కంటి చూపు మెరుగుపరడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

* ఈ పండులో ఉండే పొటిషం వల్ల గుండెకు అవసరమయ్యే న్యూట్రియన్స్‌ అందుతాయి. గుండె పోటు సమస్యను దూరం చేయడంలో ఖర్బూజ ఉపయోగపడుతుంది.

* కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు ఖర్బూజను క్రమం తప్పకుండా తీసుకుంటే రాళ్లు కరిగిపోతాయి.

* ఇక ఈ పండులో ఉండే పీచు వల్ల జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. పైల్స్‌ వంటి సమస్యలతో బాధపడేవారికి మేలు చేస్తుంది.

Also Read: మజ్జిగతో బోలెడు లాభాలు.. తెలిస్తే అస్సలు వదలరు.. ఏ సమయాల్లో తాగితే మంచిదో తెలుసా..?

Balanced Diet : తినే ఆహారంలో విషయంలో కొన్ని పద్ధతులు పాటిస్తే.. మంచి ఆరోగ్యం మీ సొంతం అంటున్న వైద్యనిపుణులు

Kidney Stones Diet: కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే.. ఈ పదార్థాలను అస్సలు తినకండి