హార్మోన్ల సమస్యలతో పరేషాన్ అవుతున్నారా..? ఈ ఫుడ్స్ తింటే సరిపోతుంది.. అంతా సెట్ అయిపోతుంది..!

మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో జింక్ అనే ఖనిజానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది హార్మోన్ల సమతుల్యత, రోగనిరోధక శక్తి, జీర్ణక్రియ, నరాల ఆరోగ్యం వంటి అంశాల్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. జింక్‌ ను సహజంగా అందించే ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

హార్మోన్ల సమస్యలతో పరేషాన్ అవుతున్నారా..? ఈ ఫుడ్స్ తింటే సరిపోతుంది.. అంతా సెట్ అయిపోతుంది..!
Women Health

Updated on: Aug 03, 2025 | 9:09 PM

జింక్ అనే ఖనిజం, మహిళల ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఇది శరీరంలో హార్మోన్ల సమతుల్యతను నిలబెట్టడంలో, నరాల వ్యవస్థకు బలాన్ని ఇవ్వడంలో, శారీరక శక్తి అభివృద్ధి చెందడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తి బలంగా ఉండటానికి.. థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయడానికి కూడా జింక్ అవసరం.

నట్స్

బాదం, వాల్‌నట్ లాంటి గింజలు జింక్‌ను ఎక్కువగా కలిగి ఉంటాయి. వీటిని రోజూవారీ ఆహారంలో చేర్చడం వల్ల మహిళలలో రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. ఇవి శరీరానికి అవసరమైన మంచి కొవ్వులు, ఖనిజాలతో నిండి ఉంటాయి.

గుమ్మడికాయ గింజలు

గుమ్మడికాయ గింజలు జింక్ కు ఒక అద్భుతమైన సహజ మూలం. ఇవి తక్కువ కేలరీలతో ఉండి.. ఆరోగ్యానికి చాలా లాభాలను ఇస్తాయి. వీటిని స్నాక్స్ గా లేదా సలాడ్ లలో వేసుకుని తినవచ్చు.

చిక్కుళ్లు

వేరుశెనగలు, రాజ్మా, శనగలు, మినుములు లాంటి కాయధాన్యాల్లో మంచి మోతాదులో జింక్ ఉంటుంది. వీటిని వారం అంతా వాడుతూ ఉంటే.. శరీరానికి అవసరమైన ఖనిజాలు అందుతాయి.

గుడ్లు

ఒక మామూలు గుడ్డులో జింక్ సరిపడినంత ఉంటుంది. ప్రతిరోజూ ఒక గుడ్డు తినడం వల్ల మహిళలు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. ఇది ప్రోటీన్ తో పాటు జింక్‌ను కూడా ఇస్తుంది.

పాల ఉత్పత్తులు

పాలు, పెరుగు, చీజ్ లాంటి పాలతో తయారయ్యే పదార్థాల్లో కూడా కొంతమేర జింక్ ఉంటుంది. ఇవి ఎముకల బలాన్ని పెంచడంలో సాయపడతాయి. రోజూ వీటిని తక్కువ పరిమితిలో తీసుకోవడం మంచిది.

ఎర్ర మాంసం

చికెన్, మటన్ లాంటి ఎర్ర మాంసాల్లో కూడా జింక్ లభిస్తుంది. అయితే ఇవి కొలెస్ట్రాల్ కారణంగా తక్కువగా తీసుకోవాలి. వారానికి 1 నుంచి 2 సార్లు తీసుకుంటే సరిపోతుంది.

సన్ ఫ్లవర్ సీడ్స్

సన్ ఫ్లవర్ సీడ్స్ కూడా మంచి జింక్ మూలంగా పనిచేస్తాయి. ఇవి చివరికి జీర్ణక్రియను మెరుగుపరచడంలో శక్తిని పెంచడంలో సాయపడతాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)