మన దేశంలో ముఖ్యంగా వంట గదిలో చాలా విరివిగా కనిపించే నల్ల మిరియాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలైనవి. సాధారణంగా ఆహారంలో మంచి రుచి కోసం ఉపయోగించే ఈ నల్ల మిరియాలతో మనకు తెలయని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే మన పూర్వీకులు, ఆయర్వేద నిపుణులు దీనిని విరివిరిగా వాడుతుండేవారు. ఇంకా వాడుతున్నారు కూడా. వీటిని వాడుతారు. ఎందుకంటే నల్ల మిరియాల వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇంకా ఇందులో విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ బి6, థయామిన్, నియాసిన్, సోడియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా నల్ల మిరియాలను ఆహారాల్లో తీసుకుంటే శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ క్రమంలోనే బరువు తగ్గాలనుకునేవారు కూడా తమ డైట్‌లో నల్ల మిరియాలను చేర్చుకుని వినియోగిస్తే.. సులభంగా బరువు తగ్గుతారు.
అంతేకాకుండా ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కూడా లభిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకువారు తప్పకుండా నల్ల మిరియాలను వినియోగించాల్సి ఉంటుంది. అయితే నల్ల మిరియాలకు మరో విశిష్టత కూడా ఉంది. అదేమిటంటే.. మన దేశానికి మిరపకాయలు అనేవి పరిచయం కాకముందు మన పూర్వీకులు మిరియాల పొడినే కారంగా వాడేవారు. అంటే మిరియాలతో మన బంధం ఈ నాటిది కానే కాదు. కానీ మిరియాలను ఎక్కువగా వాడుతున్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఇంకా మిరియాల్లో నల్లవే కాకుండా తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు, గులాబీ రంగుల్లో కూడా ఉంటాయి. మరి అటువంటి మిరియాలతో బరువు ఎలా తగ్గుతారో.. ఇంకా ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
నల్ల మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే పైపెరిన్.. మన శరీరంలోని కొవ్వును పెంచే కణాల తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇందులో కేలరీలు కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి శరీర బరువును సులభంగా నియంత్రిస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..