Thyroid Health Tips: మన శరీరంలో ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్ కూడా ఒకటి. దీని నుంచి విడుదలయ్యే థైరాక్సిన్ అనే హార్మోన్ శరీర సమతాస్థితిని కాపాడుతుంది. అంటే ఇది శరీరంలో ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా ఆరోగ్య సమస్యలు తప్పవు. అయితే థైరాయిడ్ వచ్చినప్పుడు సాధారణంగా కండరాల నొప్పి ఉంటుంది, ఫలితంగా కీళ్ల నొప్పులు, చర్మం పొడిబారడం, ఊబకాయం వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే సమస్యను నియంత్రించడాన్ని క్లిష్టతరం చేసే ఆహారాలు కొన్ని ఉన్నాయి. అందువల్ల థైరాయిడ్ ఉన్నవారు వాటికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఆ ఆహారాలు ఏమిటంటే..?
ఫైబర్ ఫుడ్: ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ థైరాయిడ్ రోగులు ఫైబర్ ఫుడ్‌ని అధికంగా తీసుకంటే సమస్యను మరింత తీవ్రతరం అవుతుంది. ఇంకా కడుపు సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది.
గ్లూటెన్ ప్రోటీన్: థైరాయిడ్ రోగులు గ్లూటెన్ ప్రోటీన్ ఉన్న ఆహారాలను కూడా తినకూడదు. ఎందుకంటే గ్లూటెన్ థైరాయిడ్ మందులతో కలిసి సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.
ప్రాసెస్డ్ ఫుడ్: థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని కూడా తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వల్ల మీ సమస్య మరింత తీవ్రతరం కావడంతో పాటు కండరాల నొప్పి పెరుగుతుంది. ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి