Thyroid: థైరాయిడ్ సమస్యకు మందులు వేసుకుంటున్నారా ?.. అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..

ప్రస్తుత ఆధునిక కాలంలో చాలా మంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. చిన్నా, పెద్ద ఇలా వయసుతో సంబంధం

Thyroid: థైరాయిడ్ సమస్యకు మందులు వేసుకుంటున్నారా ?.. అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..
Tyroid

Updated on: Dec 24, 2021 | 8:35 AM

ప్రస్తుత ఆధునిక కాలంలో చాలా మంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. చిన్నా, పెద్ద ఇలా వయసుతో సంబంధం లేకుండా అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా థైరాయిడ్ సమస్య కూడా ఎక్కువగా కనిపిస్తోంది. నిజానికి ఈ సమస్య హార్మోన్స్ లోపం వలన కలుగుతుంది. ఇప్పుడు చాలా వరకు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చిన్న వయసులోనే థైరాయిడ్ సమస్యతో బాధపడుతూ.. అందుకు మందులను ఉపయోగిస్తున్నారు.

థైరాయిడ్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి థైరాయిడ్ గ్రంధి నుంచి హార్మోన్లు అధికంగా ఉంటుంది. ఇది హైపర్ థైరాయిడ్ అంటారు. అయితే హర్మో్న్స్ తక్కువగా ఉన్నప్పుడు కూడా థైరాయిడ్ సమస్య ఇబ్బంది పెడుతుంది. థైరాయిడ్ స్థాయిని సరిగ్గా నిర్వహించలేకపోతే అది గుండె, నరాల సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది. థైరాయిడ్ సమస్య కోసం మందులు తీసుకోవడం ప్రారంభిస్తుంటే.. ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఎందుకంటే ఆహారం తిన్న తర్వాత థైరాయిడ్ మందులు తీసుకుంటే వాటి ప్రభావం తగ్గుతుంది.

థైరాయిడ్ సమస్య ఉన్నవారు క్రమం తప్పకుండా మందులు తీసుకోవాలి. థైరాయిడ్ స్థాయిని నియంత్రించడంలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. భోజనానికి అరగంట నుంచి గంట ముందు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే థైరాయిడ్ సమస్యకు మందులను వివిధ మార్గాలుగా తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తారు. థైరాయిడ్ మందులను సాధారణ నీటితో తీసుకోవాలి. టీ లేదా కాఫీతో తీసుకోవద్దు.

థైరాయిడ్ కాకుండా ఇతర వ్యాధులకు మందులు తీసుకుంటే ఈ రెండింటిని కలిపి తీసుకోవద్దు. ఉదయాన్నే ఏదైనా సప్లిమెంట్ తీసుకోవాల్సి వచ్చినప్పటికీ థైరాయిడ్ మందులు, సప్లిమెంట్స్ తీసుకోవడానికి మధ్య దాదాపు ఒక గంట గ్యాప్ ఉండాలి. రెండు కంటే అంతకంట ఎక్కువ మందులు తీసుకోవాల్సి వస్తే ముందుగా వైద్యుడిని సంప్రదించాలి.

Also Read: Radhe Shyam Trailer: ప్రాణం పోసే ప్రేమ ప్రాణం తీయగలదా.. రాధేశ్యామ్ ట్రైలర్ అదుర్స్..

Thaggedhe Le: ‘తగ్గేదే లే’ డైలాగ్ చెప్పిన క్రికెటర్ జడేజా.. పుష్ప ఫీవర్ మాములుగా లేదుగా..

Pushpa: యూట్యూబ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన శ్రీవల్లి సాంగ్‌.. 100 మిలియన్ల వ్యూస్‌ను దాటేసి..