Gas Problem: మీరు గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ పని చేయండి..

|

Feb 13, 2022 | 5:32 PM

ఈ మధ్య చాలా మందికి గ్యాస్‌ సమస్య వస్తుంది. దీంతో వారు ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Gas Problem: మీరు గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ పని చేయండి..
Gas
Follow us on

ఈ మధ్య చాలా మందికి గ్యాస్‌ సమస్య వస్తుంది. దీంతో వారు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే లో–ఫోడ్‌మ్యాప్‌ ఆహారం తీసుకోవడంతో ఈ సమస్యను చాలావరకు అధిగమించవచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు. గ్యాస్ సమస్య తగ్గాలంటే వరి అన్నం, గ్లూటెన్‌ ఫ్రీ బ్రెడ్‌ తీసుకోవాలి.

పండ్లలో అరటి, నేరేడు, ద్రాక్ష, కివీ, నిమ్మ, బత్తాయి, నారింజ, బొప్పాయి, పైనాపిల్, స్ట్రాబెర్రీ ఎక్కువగా తినాలి. కూరగాయల్లో క్యారట్, దోస, అల్లం, మిరియాలు, లెట్యూస్, ఆలుగడ్డ, పాలకూర, టొమాటో తింటే గ్యాస్ సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. చికెన్, ఫిష్‌, పల్లీలు, వాల్‌నట్స్‌ వంటి పదార్థాలు తీసుకోవాలి.

నీరు ఎక్కువగా తీసుకోవాలి

ఆహారంతో పాటు నీరు కూడా సమృద్ధిగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మనిషికి ఆహారంతో పాటు నీరు ముఖ్యమని పేర్కొన్నారు.

గ్యాస్ సమస్య ఉన్నవారు

గ్యాస్‌ సమస్య ఉన్నవారు పాస్తా, కేక్‌ బిస్కెట్స్, పియర్, ప్రూన్, పీచ్, చెర్రీస్, వెజిటబుల్స్‌లో బ్రాకలీ, కాలీఫ్లవర్, ఉల్లి, వెల్లుల్లి, బీట్‌రూట్స్, ప్రోటీన్స్‌లో బీన్స్, సోయాబీన్స్‌ వంటి వాటికి నుంచి దూరంగా ఉండాలి.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి

Read Also.. Calcium Deficiency: కాల్షియం లేకపోతే చాలా ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్‌..