ఇటీవల చాలా మంది డయాబెటిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. శరీరంలో ఇన్సూలిన్ తక్కువగా విడుదలైనప్పుడు మధుమేహం సమస్య వస్తుంది. అలాగే మారుతున్న జీవనశైలితో ఊబకాయం, ఒత్తిడి వంటి సమస్యలతో ఇప్పటి యువతకు డయాబెటిక్ ప్రమాదం తొందరగా అటాక్ చేస్తుంది. అయితే ఒక్కసారి డయాబెటిక్ బారీన పడితే.. నియంత్రణ చాలా కష్టం. నిత్యం మందులతో సహజీవనం చేయాల్సి వస్తుంది. అయితే కేవలం కెమికల్ ట్యాబ్లెట్స్ మాత్రమే కాకుండా.. ఆయుర్వేదం, ఇంటి నివారణలను అనుసరించడం ద్వారా డయాబెటిక్ సమస్యను నియంత్రించవచ్చు. ముఖ్యంగా ఇంట్లో ఉండే కొన్ని మొక్కల ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు. అవెంటో తెలుసుకుందామా.
* కలబంద మొక్క..
కలబంద అన్ని సమస్యలకు నివారిణి. ఇది డయాబెటిక్ రోగులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రక్తంలో షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంలో సహాయపడే కొన్ని పదార్థాలు ఇందులో ఉన్నాయి. రక్తంలో గ్లూకోజ్ మొత్తాన్ని నియంత్రించడానికి కలబంద దివ్యౌషధంగా పనిచేస్తుంది.
* ఇన్సులిన్ ప్లాంట్..
ఆయుర్వేదంలో ఇన్సులిన్ మొక్కకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్క డయాబెటిక్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మొక్క ఆకులు పుల్లగా ఉంటాయి. ఈ ఆకులను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించవచ్చు.
* స్టెవియా ప్లాంట్..
డయాబెటిక్ రోగులకు స్టెవియా మొక్క చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని ఆకులు తియ్యగా ఉంటాయి.ఈ ఆకులను పొడి చేసి టీ, షర్భత్లలో చక్కెరగా ఉపయోగించవచ్చు. దీని ఆకులు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఉపయోగపడతాయి. ఇందులో జీరో కేలరీలు ఉంటాయి. అలాగే తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది.
* వేప ఆకులు..
ఆయుర్వేదంలో వేప ఆకులకు చాలా ప్రాముఖ్యత ఉంది. వేప ఆకుపచ్చ ఆకులలో గ్లైకోసైడ్స్, అనేక యాంటీ-వైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ మొత్తాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
Also Read: టైటానిక్ హీరో ఆప్గాన్‌లో అగ్గి రాజేశాడు.. ఆ నిప్పు మళ్లీ ఇప్పుడు రాజుకుంటుంది.. ఏం చేశాడంటే..
Shruti Haasan: అమెజాన్ ప్రైమ్‌తో భారీ డీల్ చేసుకున్న శ్రుతిహాసన్.. పెద్ద సాహసమే చేస్తోందిగా..