Shiny Teeths: ముత్యాల్లా మెరిసే దంతాలు కావాలా?.. అయితే, ఈ పండ్లను ఖచ్చితంగా తినాల్సిందే..!

|

Oct 12, 2021 | 12:48 PM

Shiny Teeths: ముత్యాల్లా మెరిసే దంతాలు ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

Shiny Teeths: ముత్యాల్లా మెరిసే దంతాలు కావాలా?.. అయితే, ఈ పండ్లను ఖచ్చితంగా తినాల్సిందే..!
Teeth
Follow us on

Shiny Teeths: ముత్యాల్లా మెరిసే దంతాలు ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. చాలా మంది హోమ్ రెమిడీస్‌ని ప్రయత్నిస్తుంటారు. అయితే, మెరిసే దంతాల కోసం మనం తినే పదార్థాలు కూడా ఉపకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని పండ్లు తినడం ద్వారా దంతాలు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. తెల్లగా మెరుస్తాయని చెబుతున్నారు. రోజుకు రెండు పూటలా(ఉదయం, రాత్రి పడుకునే ముందు) బ్రష్ చేయడంతో పాటు.. కొన్ని రకాల పండ్లు తినడం ద్వారా దంతా శుభ్రమవుతాయని పేర్కొంటున్నారు. మరి నిపుణులు చెబుతున్న ఆ పండ్లు ఏంటి? వాటి ద్వారా దంతాలకు కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

స్ట్రాబెర్రీ..
స్ట్రాబెర్రీలలో ఎంజైమ్ మాలిక్ యాసిడ్ ఉంటుంది. తెల్లటి దంతాల కోసం స్ట్రాబెర్రీలను నేరుగా దంతాలపై రుద్దడం, పేస్ట్ లా రఫ్ చేయడం చేయాలి. లేదా వాటిని బాగా నమిలి తిన్నా ఉపయోగం ఉంటుంది. స్ట్రాబెర్రీలు దంతాలపై చాలా ప్రభావం చూపుతాయి.

అరటి..
అరటి పండ్లలో పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ పుష్కలంగా ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే దంతాలపై ప్రభావం చూపుతుంది. అరటి తొక్క లోపలి భాగాన్ని దంతాలపై రుద్దడం ద్వారా దంతాలు తెల్లగా మారేందుకు సహాయపడుతుంది.

క్రాన్బెర్రీస్..
క్రాన్బెర్రీ‌లో బ్యాక్టీరియాను నాశనం చేసే లక్షణాలు ఉన్నాయి. ఇది దంత క్షయం నుంచి దంతాలను రక్షించడమే కాకుండా.. నోటి దుర్వాసన కూడా రాకుండా నివారిస్తుంది. క్రాన్బెర్రీ జ్యూస్ కూడా తాగొచ్చు.

యాపిల్స్..
యాపిల్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో పదార్థాలు దంతాలను క్లీన్ చేయడంలో సహాయపడుతాయి. యాపిల్స్‌తో పాటు క్యారెట్, ఆకు కూరలు వంటి పచ్చి కూరగాయలు కూడా దంతాలను శుభ్రపరచడంలో తోడ్పాటునందిస్తాయి. దంతాలపై ఉండే బ్లాక్టీరియాను తొలగించి, ఆరోగ్యంగా ఉంచుతాయి.

Also read:

UPSC Recruitment 2021: యూపీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్.. దరఖాస్తుకు నేడే చివరి తేదీ..

Anu Emmanuel: చీరకట్టి సోయగాలు విరజల్లుతున్న అందాలు చూడతరమా… అను ఇమ్మాన్యుయేల్‌ ఫొటోస్..

Team India Coach: రవిశాస్త్రి స్థానంలో వచ్చేది ఆయనేనా? న్యూజిలాండ్ సిరీస్‌ కంటే ముందే అఫిషీయల్ ప్రకటన