Health Tips : వర్షాకాలంలో.. ఈ కూరగాయలు తింటున్నారా.. అయితే ఇది మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే

|

Jun 29, 2022 | 9:14 AM

సీజన్ ను బట్టి ఆహార విషయాల్లో మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. మనం తీసుకునే ఆహరన్ని బట్టే మన ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. ఆహార విషయంలో మనం చేసే చిన్న చిన్న మార్పులే మనకు శ్రీరామ రక్ష.

Health Tips : వర్షాకాలంలో.. ఈ కూరగాయలు తింటున్నారా.. అయితే ఇది మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే
Vegetables
Follow us on

Health Tips : సీజన్ ను బట్టి ఆహార విషయాల్లో మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. మనం తీసుకునే ఆహరన్ని బట్టే మన ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. ఆహార విషయంలో మనం చేసే చిన్న చిన్న మార్పులే మనకు శ్రీరామ రక్ష. ఆహరం అధికంగా తిన్నా ప్రమాదమే.. అసలు తినకున్నా ప్రమాదమే.. అయితే ఆహారాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం. ఇక ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది. వర్షాలు విస్తారంగా కురుస్తున్న ఈ సమయంలో ఆహరంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో తెలుసుకుందాం.. ముఖ్యంగా కొన్ని కూరగాయలను ఈ వర్షాకాలం లో తినకపోవడమే మంచిది అన్నటున్నారు నిపుణులు. ఆ కూరగాయలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

వంకాయలు.. నీలం రంగు వంకాయలలో ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఇవి ఆల్కలాయిడ్ అలెర్జీ వల్ల చర్మం దద్దుర్లు, దురద, స్కిన్‌ రాషెస్ వంటివి వస్తాయి. అందువల్ల వంకాయలను వర్షాకాలం దూరంగా పెట్టడమే మంచింది. వర్షాకాలంలో క్యాప్సికమ్‌ తిసుకుంటే.. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయట. క్యాప్సికమ్‌లో గ్లూకోసినోలేట్స్ అనే కెమికల్‌ ఉంటుంది. దీనివల్ల వాంతులు విరోచనాలు, శ్వాస సమస్యలు వచ్చే అవకాశం ఉంది. క్యాలీఫ్లవర్‌ను వర్షాకాలంలో తక్కువగా తీసుకోవడం మంచిది అంటున్నారు వైద్యులు. ఇందులో గ్లూకోసినోలేట్స్ అనే కాంపౌడ్స్‌ ఉంటాయి. ఇవి అలెర్జీలు కలిగిస్తాయి. ఈ కూరగాయలకు వర్షాకాలంలో దూరంగా ఉండటమే మంచింది అంటున్నారు నిపుణులు.

(హెల్త్ టిప్స్ ఫాలో అయ్యేముందు నిపుణులను, వైద్యులను సంప్రదించడం) 

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి