Heart Attack Symptoms: గుండెపోటు లక్షణాలివే.. మీలో కనిపిస్తే అసలు నిర్లక్ష్యం చేయకండి..

గుండెపోటు బారిన పడి అక్కడికక్కడే మరణించిన సందర్భాలు చాలా ఉన్నాయి. సరిలేని జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు..

Heart Attack Symptoms: గుండెపోటు లక్షణాలివే.. మీలో కనిపిస్తే అసలు నిర్లక్ష్యం చేయకండి..
Heart Attack

Updated on: Mar 11, 2023 | 11:59 AM

ప్రస్తుతకాలంలో మానవాళిని వెంటాడుతున్న ఆరోగ్య సమస్యలలో గుండె పోటు ప్రథమ స్థానంలో ఉంది. ఒకప్పటి రోజుల్లో పెద్దవారిలో మాత్రమే కనిపించే ఈ సమస్య.. ఇప్పుడు చిన్న వయసులోనే గుండెపోటు వచ్చి మరణానికి కూడా కారణమవుతోంది. జిమ్ చేస్తూ, డ్యాన్స్ చేస్తూ, ఆఖరికీ నడుస్తూ కూడా గుండెపోటుతో కూలిపోయి మరణించిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం బీహార్‌లో ఉపన్యాసం ఇస్తున్న ఓ వ్యక్తి ఉన్నపాటుగా గుండెపోటుతో మరణించాడు. ఇలా గుండెపోటు బారిన పడి అక్కడికక్కడే మరణించిన సందర్భాలు చాలా ఉన్నాయి. సరిలేని జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు, కరోనా వైరస్‌ కారణంగా గుండె జబ్బులు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే గుండె జబ్బులను కూడా నియంత్రించవచ్చు. కానీ అంతకంటే ముందు దీని కోసం గుండెపోటు లక్షణాలను సకాలంలో గుర్తించడం చాలా ముఖ్యం. చాలా సందర్భాలలో ఉదయం నిద్రలేవగానే గుండె జబ్బుల గురించి శరీరం హెచ్చరిస్తుంది.

అయితే  ప్రజలు దానిని పెద్దగా పట్టించుకోరు, ఇంకా గుర్తించలేకపోవడం మరణానికి కారణంగా మారుతుంది. స్థూలకాయం, మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపుడుతున్నవారు గుండెపోటు లక్షణాలను అస్సలు విస్మరించకూడదని వైద్యులు అంటున్నారు. గుండెపోటు వచ్చే ప్రమాదం చాలాసార్లు ఉదయాన్నే ఎక్కువగా ఉంటుందని కార్డియాలజిస్ట్ డాక్టర్ అజిత్ కుమార్ వివరిస్తున్నారు. వైద్యులు దీనిని సిర్కాడియన్ రిథమ్ అని పిలుస్తారు. ఉదయాన్నే బీపీ కూడా పెరగడం మొదలవుతుంది. దీంతో గుండెపోటు రావచ్చు. అటువంటి పరిస్థితిలో ఈ లక్షణాలు ఉదయం కనిపిస్తే అప్పుడు అప్రమత్తంగా ఉండండి. చాలా సార్లు ఉదయం పూట ఛాతీలో మంట, నొప్పి వస్తుందని డాక్టర్ చెబుతున్నారు. చాలా సందర్భాలలో ప్రజలు దీనిని గ్యాస్ సమస్యగా భావిస్తారు. అలా నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తున్నారు. ఉదయం ఛాతీ నొప్పి ఉంటే, ఎడమ చేయి లేదా భుజం వరకు నొప్పి ఉన్నా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు.

చాలా సార్లు మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే వాంతులు లేదా వికారం సమస్య ఉంటుంది. కానీ ప్రజలు వాంతులను కడుపు సమస్యగా భావించే అవకాశం ఉంది. కానీ చాలా సందర్భాలలో ఇది గుండెపోటు లక్షణం కూడా కావచ్చు. ఛాతీ నొప్పి వాంతులు లేదా వికారం సమస్యలు ఉంటే విస్మరించకూడదు. వెంటనే వైద్యులను సంప్రదించంచాలని ఆయన సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..