Health: ప్రకృతి మనకు సహజంగా ఇచ్చిన ఆహార పదార్థాల్లో ఉసిరి ఒకటి. మరీ ముఖ్యంగా శీతాకాలం వచ్చిందంటే ఉసిరి ఎక్కువగా కనిపిస్తుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు మనకు తెలియజేయడానికి మన పూర్వీకులు కార్తీక మాసంలో ఉసిరి దీపాలు వెలిగించడం, ఉసిరితో స్నానం చేయడం లాంటివి ఆచారంలో భాగం చేశారు. ఉసిరిలో ఉండే విటమిన్ సి, పాలీఫెనాల్స్, ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్, జింక్ వంటి పోషకాలు శరరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే ఉసిరితో చర్మం, కంటిచూపు, జుట్టుకు ఉపయోగపడుతుంది.
ఇదిలా ఉంటే ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్న ఉసిరితో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయనే విషయం మీకు తెలుసా.? అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ కేవలం కొందరికి మాత్రమే. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి ఉసిరి మేలు కంటే కీడే చేస్తుంది. ఇంతకీ ఉసిరిని ఎవరు తీసుకోకూడదు.? తీసుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అన్న విషయాలు ఇప్పుడు చూద్దాం..
డ్రై స్కిన్ సమస్యతో బాధపడేవారు ఉసిరి తీసుకోవడం వల్ల సమస్య తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి. ఉసిరికి ఉండే కొన్ని లక్షణాలు శరీరంలో డీహైడ్రేషన్ సమస్యను పెంచుతుంది. కాబట్టి ఉసిరి తీసుకుంటే చర్మం పొడిబారుతుంది. కాబట్టి డ్రై స్కిన్‌తో బాధపడే వారు ఉసిరికి దూరంగా ఉండడమే మేలు. ఒకవేళ తింటే మాత్రం పుష్కలంగా నీటిని తాగడం వల్ల బ్యాలెన్స్ చేసుకోవచ్చు.
కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడే వారు కూడా ఉసిరికి దూరంగా ఉండాలి. మరీ ముఖ్యంగా ఉసిరి, అల్లంతో తయారు చేసిన వాటిని అస్సలు తీసుకోకూడదు. వీటివల్ల కాలేయానికి హాని కలిగించే ఎంజైమ్‌ల స్థాయి పెరుగుతుంది.
సాధారణంగా ఉసిరి తీసుకోవడం వల్ల శరీరంలో రక్త పోటు తగ్గుతుతుంది. దీంతో తక్కువ రక్తపోటుతో బాధపడేవారికి మరింత ప్రమాదం ఉంటుంది. కాబట్టి లో బీపీతో బాధపడేవారు ఉసిరికి దూరంగా ఉండడమే మేలు.
కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడేవారు ఉసిరిని తీసుకునే ముందు వైద్యుల సలహాలను కచ్చితంగా తీసుకోవాలి. ఉసిరి తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయి పెరుగుతుంది. దీంతో ఇది కిడ్నీలపై ఒత్తిడిని పెంచుతుంది. వెరసి కిడ్నీల పనితీరు ప్రభావితమయ్యే అవకాశాలు ఉంటాయి.
జలుబు ఉన్న వారు కూడా ఉసిరి కాయకు దూరంగా ఉండాలి. సహజంగా ఉసిరి చలువు చేస్తుంది. కాబట్టి జలుబు తగ్గే వరకు ఉసిరి తినకపోవడమే మంచిది.
Also Read: T20 World Cup 2021: న్యూజిలాండ్‌పై మాజీ క్రికెటర్ల ప్రశంసలు.. అద్భుతంగా ఆడారని సచిన్ కితాబు..
Viral Video: రెస్టారెంట్ నిండా రంగురంగుల చేపలు.. ఈ స్వీట్‌ఫిష్ కేఫ్ ప్రత్యేకత ఏంటంటే..
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ పోలీసు స్టేషన్‌లో బైభీమ్ సీన్.. గిరిజన యువకుడిపై పోలీసుల ప్రతాపం..