Weak Immunity: మీ రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గానే పనిచేస్తుందా.? ఈ లక్షణాలు మీలో ఉంటే.. శక్తి తగ్గుతున్నట్లే లెక్క.

Weak Immunity: శరీరంపై రకరకలా బ్యాక్టీరియాలు, వైరస్‌లు నిత్యం దాడి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. అయితే శరీరానికి సహజంగానే లభించే నిరోధక శక్తి కారణంగా చాలా వరకు మనపై ప్రభావం చూపకుండానే నిర్వీర్యం అవుతుంటాయి...

Weak Immunity: మీ రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గానే పనిచేస్తుందా.? ఈ లక్షణాలు మీలో ఉంటే.. శక్తి తగ్గుతున్నట్లే లెక్క.
Weak Immunity Power

Edited By: Phani CH

Updated on: Jul 19, 2021 | 9:20 AM

Weak Immunity: శరీరంపై రకరకలా బ్యాక్టీరియాలు, వైరస్‌లు నిత్యం దాడి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. అయితే శరీరానికి సహజంగానే లభించే నిరోధక శక్తి కారణంగా చాలా వరకు మనపై ప్రభావం చూపకుండానే నిర్వీర్యం అవుతుంటాయి. ఈ రోగ నిరోధక శక్తి పనితీరు మనం తీసుకునే ఆహారం, జీవన శైలిపై ఆధారపడి ఉంటుంది. కరోనా సమయంలో రోగ నిరోధక శక్తిపై పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారిపైనే కరోనా వైరస్‌ తీవ్రంగా ప్రభావం చూపింది. మరి ఇంతకీ మన నిరోధక శక్తి సరిగ్గానే పనిచేస్తుందా.? లేదా అన్న విషయాన్ని శరీరంలో కనిపించే కొన్ని లక్షణాలు ద్వారా తెలుసుకోవచ్చనే విషయం మీకు తెలుసా.? అవేంటంటే..

* సాధారంగా శరీరంలో రోగ నిరోధక శక్తి సరిగ్గా ఉంటే మనకు అయ్యే గాయాలు వెంటనే మానుతుంటాయి. అలా కాకుండా ఎంతకీ గాయాలు తగ్గట్లేదు అంటే రోగ నిరోధక శక్తి తగ్గుతందనే విషయాన్ని గుర్తించాలి.
* తరచూ రకరకాల ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతుంటే కూడా శరీరంలో సరిపడ రోగ నిరోధ శక్తి లేదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి.
* ఇక ఏ పని చేయకున్నా కాసేపటికే అలసి పోవడం, నిత్యం నీరసంగా ఉండడం కూడా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని చెప్పడానికి సూచనలు.
* రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారు తొందరగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కొంచెం ఒత్తిడిని కూడా వీరు తట్టుకోలేరు. కాబట్టి తరచూ ఒత్తిడికి గురవుతుంటే మీలో నిరోధక శక్తి తగ్గుతుందని గమనించాలి.
* క్రమం తప్పకుండా దగ్గు, జ్వరం, జలుబు వస్తుంటే శరీరంలో సరిపడ రోగ నిరోధక శక్తి లేదని గుర్తించాలి. ముఖ్యంగా ఈ సమస్యలు ఎక్కువ కాలం పాటు కొనసాగితే అప్రమత్తమవ్వాలి.
* రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారిలో జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వీరీలో నిత్యం కడుపులో అసౌకర్యంగా ఉండడం, విరేచనాలు అవుతుండడం గమనించవచ్చు.
పైన తెలిపిన లక్షణాలు కనిపిస్తే మీలో రోగ నిరోధక వ్యవస్త ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని భావించాలి. కాబట్టి ఈ సమస్యలు నిత్యం ఎదురవుతుంటే.. రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఇందులో భాగంగా మంచి ఆహారం సరిపడ నిద్ర, యోగా వంటివి చేయాలి.

Also Read: Diabetes Symptoms: పెరుగుతున్న షుగర్‌ వ్యాధిగ్రస్తులు.. డయాబెటిస్‌ వచ్చే ముందు కనిపించే లక్షణాలు..!

Stop Hair Fall Naturally: వెంట్రుకలు నల్లగా ఒత్తుగా పెరగడానికి, బట్టలతపై జుట్టు మొలవడానికి ఈ సింపుల్ చిట్కాలు మీకోసమే

Exercise: వ్యాయామం అంటే చాలామందికి ఎన్నో అనుమానాలు.. ప్రశ్నలు.. వాటికి సమాధానాలు ఇవిగో!