Corona – Dengue: కరోనా కల్లోలం చల్లారక ముందే పంజా విసురుతున్న డెంగ్యూ.. ఈ రెండింటికీ మధ్య తేడా ఎలా గుర్తించాలో తెలుసా?

| Edited By: Ravi Kiran

Sep 21, 2021 | 6:59 AM

Corona - Dengue: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇంటిలో చూసినా ఒక్కరైనా జ్వరంతో బాధపడుతున్నారు. రాష్ట్రంలో వైరల్‌ జ్వరాలు విజృంభిస్తున్నాయి. పట్ణణాలు, పల్లెలు అనే తేడా లేకుండా...

Corona - Dengue: కరోనా కల్లోలం చల్లారక ముందే పంజా విసురుతున్న డెంగ్యూ.. ఈ రెండింటికీ మధ్య తేడా ఎలా గుర్తించాలో తెలుసా?
Follow us on

Corona – Dengue: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇంటిలో చూసినా ఒక్కరైనా జ్వరంతో బాధపడుతున్నారు. రాష్ట్రంలో వైరల్‌ జ్వరాలు విజృంభిస్తున్నాయి. పట్ణణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్రజలు జ్వరంతో బాధపడుతున్నారు. ఇక కరోనా కల్లోలం ఇంకా పూర్తిగా తగ్గకముందే ఈ వైరల్‌ ఫీవర్‌లు వస్తున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ వ్యాధి తీవ్రంగా వ్యాపిస్తోంది. ఈ సమయంలోనే ప్రజల్లో ఓ అనుమానం మొదలైంది. అటు కరోనా, ఇటు డెంగ్యూ ఈ రెండు వ్యాధులు ఒకే లక్షణాలు కలిగి ఉండడమే దీనికి కారణం. దీంతో తమకు వచ్చింది డెంగ్యూనా.? లేదా కరోనా.? అనే సందేహంలో పడిపోతున్నారు.

కోవిడ్‌, డెంగ్యూ రెండూ ఇన్‌ఫెక్షన్‌ సంబంధిత వ్యాధులే. ఈ రెండింటిలోనూ జ్వరం, ఒళ్లు నొప్పులు కామన్‌గా ఉంటాయి. ఇక కరోనా వ్యక్తి తుంపర్ల నుంచి వ్యాప్తి చెందితే, డెంగ్యూ దోమ వల్ల వస్తుంది. ఇంతకీ కరోనా, డెంగ్యూ లక్షణాల్లో ఉండే ప్రధాన తేడాలేంటో ఇప్పుడు చూద్దాం..

కరోనా లక్షణాలు..

కరోనా సోకిన వారిలో గొంతు నొప్పి, శ్వాస తీసుకోవ‌డం క‌ష్టంగా ఉండ‌డం, రుచి, వాస‌న చూసే శ‌క్తి కోల్పోవ‌డం వంటి ల‌క్షణాలు కనిపిస్తున్నాయి. వీటితో పాటు జ్వరం, పొడి ద‌గ్గు, ఒళ్లు నొప్పులు, విరేచ‌నాలు, త‌ల‌నొప్పి వంటి ల‌క్షణాలు క‌నిపిస్తాయి.

డెంగ్యూ లక్షణాలు..

ఇక డెంగ్యూ వ్యాధి లక్షణాలు విషయానికొస్తే.. త‌ల‌నొప్పి, ద‌ద్దుర్లు, వాంతులు అవ‌డం వంటి ల‌క్షణాలు ఉంటాయి. అలాగే క‌డుపు నొప్పి, వెన్ను నొప్పి, క‌ళ్ల వెనుక నొప్పిగా ఉండ‌డం, ఎముక‌లు, కీళ్ల నొప్పులు, కండ‌రాల నొప్పులు, వ‌ణ‌క‌డం, అల‌స‌ట‌, జ్వరం, వికారం వంటి ల‌క్షణాలు క‌నిపిస్తాయి.

కాబట్టి అనవసరంగా టెన్షన్‌కు గురికాకుండా మీకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయో తెలుసుకొని. వైద్యులను సంప్రదిస్తే మంచిది. ఇక అటు కరోనా అయినా ఇటు డెంగ్యూ అయినా సరైన ఆహార పదార్థాలు తీసుకుంటూ వైద్యులు సూచించిన మందులను వాడితే త్వరగానే వ్యాధి నుంచి బయటపడొచ్చు.

Also Read: ఈ 5 సుగంధ ద్రవ్యాలతో సులువుగా బరువు తగ్గవచ్చు..! కొద్ది రోజుల్లోనే తేడా గమనిస్తారు..

Typhoid: అసలే వైరల్‌ కాలం.. పొంచి ఉంది టైఫాయిడ్‌ భయం. టైఫాయిడ్‌ వస్తే ఈ జాగ్రత్తలు తప్పక పాటించాల్సిందే..

Banana In Ayurveda: ప్రకృతి ప్రసాదించిన ఔషధం అరటి చెట్టు.. దీని పువ్వు, కాండం, ఆకు అన్నీ ఆయుర్వేద వైద్యంలో ఉపపయోగాలే