Juices For Constipation: మారుతోన్న ఆహార పద్ధతులు, పెరుగుతోన్న ఒత్తిడి వెరసి జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్న ఇలాంటి రోజుల్లో చాలా మంది మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో మలబద్దకం సమస్య బాగా పెరిగి.. చివరకు పైల్స్, ఫిషర్స్ వంటి దీర్ఘకాలిక సమస్యలకు సైతం దారి తీస్తోంది. మరి సహజంగా కొన్ని జ్యూస్‌లను తీసుకుంటూ మలబద్ధకానికి చెక్ పెట్టవచ్చనే విషయం మీకు తెలుసా.? మలబద్దకాన్ని దూరం చేసే కొన్ని రకాల జ్యూస్‌లపై ఓ లుక్కేయండి..
* జీర్ణక్రియ వ్యవస్థ సక్రమంగా ఉండాలంటే ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇలా ఫైబర్ ఎక్కువగా లభించే వాటిలో ద్రాక్ష మొదటి వరుసలో ఉంటుంది. ద్రాక్షలో ఉండే ఫైబర్ మలబద్దకం సమస్యను నయం చేస్తుంది.
* మలబద్దకాన్ని తరమికొట్టడంలో యాపిల్ జ్యూస్ కూడా ఎంతో క్రీయాశీలకంగా పనిచేస్తుంది. వీటిలో ఉండే ఫైబర్, మినరల్స్, విటమిన్లు జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఎలాంటి ఒత్తిడి లేకుండా వీరేచనం కావాలంటే ప్రతి రోజూ యాపిల్ జ్యూస్ తీసుకోవాలి.
* జీర్ణ క్రియ సమస్యలను మెరుగుపరచడంలో విటమిన్ సీ ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇలాంటి విటమిన్ సీ అధికంగా లభించే నారిజం పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. ముఖ్యంగా నారింజను జ్యూస్ రూపంలో తీసుకుంటే మలబద్దకం సమస్య నుంచి త్వరగా బయటపడొచ్చు.
* పైనాపిల్ కూడా మలబద్దకానికి మంచి విరుగుడుగా పని చేస్తుంది. వీటిలో ఉండే బ్రొమెయిలిన్ అనే ఎంజైమ్ విరేచనం సాఫీగా కావడానికి ఉపయోగపడుతుంది. పైనాపిల్ జ్యూస్‌ను తీసుకుంటే.. పేగుల్లో ఉండే మలం పూర్తిగా శుభ్రంగా మారుతుంది.
* నిమ్మకాయలో కూడా విటమిన్ విరివిగా ఉంటుందని తెలిసిందే. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు మలబద్ధకాన్ని తరిమికొడుతుంది. ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె, జిలకర్రను కలిపి పరగడపున తీసుకుంటే ఫ్రీ మోషన్ ఉంటుంది.
Also Read: Health Tips: జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఈ ఆహారాన్ని మీ డైట్ చేర్చండి..!
Weight Loss: ఈ ఆహార పదార్థాలను కలిపి తీసుకుంటే బరువు తగ్గడం ఖాయం.. ట్రై చేస్తే రిజల్ట్ పక్కా..
Healthy Food: రోగ నిరోధక శక్తిని పెంచే మొలకెత్తిన విత్తనాల సూప్.. ఎలా తయారు చేయాలంటే..