Health: ఎప్పుడూ నీరసంగా ఉంటుందా…? అయితే ఈ లోపమే అయి ఉండొచ్చు

|

Feb 11, 2024 | 6:42 PM

ఏమాత్రం తేడా కొట్టినా వెంటనే ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. ఇలా శరీరంలో కీలక పాత్ర పోషించే వాటిలో పొటాషియం ఒకటి. పొటాషియం శరీరంలో నీటి పరిమాణంతో పాటు రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచేందుకు ఉపయోగపడతాయి. శరీరంలో సరిపడ పొటాషియం లేకపోతే...

Health: ఎప్పుడూ నీరసంగా ఉంటుందా...? అయితే  ఈ లోపమే అయి ఉండొచ్చు
Fatigue
Follow us on

ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు, మినరల్స్ కీలక పాత్ర పోషిస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్ని రకాల మినరల్స్‌ సక్రమంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఏమాత్రం తేడా కొట్టినా వెంటనే ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. ఇలా శరీరంలో కీలక పాత్ర పోషించే వాటిలో పొటాషియం ఒకటి. పొటాషియం శరీరంలో నీటి పరిమాణంతో పాటు రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచేందుకు ఉపయోగపడతాయి. శరీరంలో సరిపడ పొటాషియం లేకపోతే కొన్ని రకాలస సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల లక్షణాల ద్వారా పొటాషియం లోపాన్ని గుర్తించవచ్చు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటంటే..

పొటాషియం లోపిస్తే కనిపించే లక్షణాలు..

* శరీరంలో సరిపడ పొటాషియం లేకపోతే కండరాలు బలహీనంగా మారుతాయి. నిత్యం కండరాలు పట్టుకుపోయిన భావన కలుగుతుంది. ఇది పొటాషియం లోపానికి ముఖ్య లక్షణంగా చెప్పొచ్చు.

* ఇక కొందరిలో నిత్యం అలసట, గుండె అసాధారణ రీతిలో కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక కొన్ని సందర్భాల్లో ఆకలిలేకపోవడం, మానసిక కుంగుబాటుకు గురికావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

* శరీరంలో పొటాషియం లోపిస్తే.. ఆకలి లేకపోవడం, మానసిక కుంగుబాటు, నిత్యం వాంతులు, విరేచనాలు అవుతుంటాయి.

* మలంలో రక్తం రావడం కూడా పొటాషియం లోపానికి సూచనగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మనకు రోజుకు 2.5 గ్రాముల నుంచి 3.5 గ్రాముల వరకు పొటాషియం అవసరం పడుతుంది.

పొటాషియం లభించే ఆహార పదర్థాలివే..

* పొటాషియం ఎక్కువగా లభించాలంటే ప్రతీ రోజూ ఒక కోడి గుడ్డును తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నరు. గుడ్డులోని పోషకాలు ఆరోగ్యాన్ని రక్షిస్తాయి.

* టమాటలు, చిలగడ దుంపలు, నట్స్‌ వంటి వాటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల పొటాషియం లోపాన్ని జయించవచ్చు.

* పొటాషియం లోపాన్ని అరటి పండ్లతో చెక్‌ పెట్టొచ్చు. పొటాషియంకు అరటి పండు పెట్టింది పేరు. రక్తపోటును తగ్గించి, మానసిక ప్రశాంతను, మంచి నిద్రను అందిస్తాయి.

* వీటితో పాటు.. పాలు, పెరుగు, మాంసం, నారింజ, కివీ కొబ్బరి నీళ్లలో కూడా పుష్కలంగా పొటాషియం లభిస్తుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.