Custard Apple: షుగర్‌ పేషెంట్స్‌ సీతాఫలం తినొచ్చా.? డిప్రెషన్‌కు ఈ పండ్లకు ఉన్న సంబంధం ఏంటి.?

|

Sep 19, 2022 | 9:29 AM

Custard Apple: చలికాలం వచ్చిందంటే చాలు సీతాఫలాలు సందడి షురూ అవుతుంది. రోడ్డుపై ఎక్కడ చూసినా సీతాఫలాలు దర్శనిస్తాయి. రుచిలో అమృతాన్ని తలపించే ఈ పండును ఎవ్వరైనా ఇష్టపడాల్సిందే. కేవలం రుచిలోనే కాకుండా ఆరోగ్యం విషయంలోనూ...

Custard Apple: షుగర్‌ పేషెంట్స్‌ సీతాఫలం తినొచ్చా.? డిప్రెషన్‌కు ఈ పండ్లకు ఉన్న సంబంధం ఏంటి.?
Custard Apple
Follow us on

Custard Apple: చలికాలం వచ్చిందంటే చాలు సీతాఫలాలు సందడి షురూ అవుతుంది. రోడ్డుపై ఎక్కడ చూసినా సీతాఫలాలు దర్శనిస్తాయి. రుచిలో అమృతాన్ని తలపించే ఈ పండును ఎవ్వరైనా ఇష్టపడాల్సిందే. కేవలం రుచిలోనే కాకుండా ఆరోగ్యం విషయంలోనూ సీతాఫలాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. కేవలం సీతాఫలమే కాకుండా ఆ చెట్టు బెరడు, ఆకులు సైతం ఎన్నో ఆయుర్వేద మందుల్లో ఉపయోగపడతాయి. అయితే తియ్యగా ఉండే ఈ పండ్లను షుగర్‌ పేషెంట్స్‌ తీసుకుంటే ఏమవుతుంది.? ఈ పండ్లతో కలిగే లాభాలేంటి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

* సీతాఫలాలు ఇన్‌స్టాంట్‌ శక్తిని ఇవ్వడంలో ముందుటాయి. ఇందులో క్యాలరీ కంటెంట్‌ యాపిల్స్‌లో కంటే రెట్టింపు ఉంటుంది. శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. ఇందులో పుష్కలంగా ఉండే పొటాషియం, కండరాల బలహీనతను తగ్గించడంతో సహాయపడుతుంది.

* సీతాఫలంలో ఉండే సోడియం, పొటాషియం శరీరంలో రక్తపోటును కంట్రోల్‌ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సీతాఫలాను తీసుకోవడం వల్ల హార్ట్‌ అటాక్‌ వచ్చే ప్రమాధాన్ని తగ్గించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

* అల్సర్‌, పొట్ట సమస్యలతో బాధపడే వారికి సీతాఫలాలు బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పొట్ట సంబంధిత వ్యాధులకు చెక్‌ పెడుతాయి. ఇందులోని అధిక మెగ్నీషియం ప్రేగుల కదలికల్లో చలనం తీసుకొస్తాయి.

* సీతాఫలం ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు డిప్రెషన్‌ను దూరం చేస్తాయి. క్యాన్సర్‌ వంటి వ్యాధులను తగ్గించడంలోనూ సీతాఫలాలు ఉపయోగపడతాయి. ఇందులోని బీ కాంప్లెక్స్‌ విటమిన్లు భావోద్వేగాలను కంట్రోల్‌ చేస్తాయి.

* సీతాఫలాల ద్వారా ఇన్ని లాభాలు ఉన్నా.. షుగర్‌ పేషెంట్స్‌ మాత్రం వీటికి దూరంగా ఉంటేనే మంచిది. వీటిలో ఉండే పాలీఫెనోలిక్‌ యాంటీ ఆక్సిడెంట్‌లు ఇన్సులిన్‌ ఉత్పత్తి పెరగడానికి కారణమవుతాయి. కాబట్టి షుగర్‌ పేషెంట్స్‌ వీలైనంత వరకు పరిమిత స్థాయిలో, ఇంకా వీలైతే దూరంగా ఉండడమే బెటర్‌ అని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన వివరాలు ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యం విషయంలో ఏ నిర్ణయమైనా సరే వైద్యుల సలహాలు తీసుకున్న తర్వాతే పాటించండం ఉత్తమం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..