ఈ మధ్యకాలంలో చాలా మంది ఆలస్యంగా తినడం ఫ్యాషన్‌గా మార్చుకున్నారు. కానీ ఈ అర్థరాత్రి తినడం వల్ల మీ ఆరోగ్యానికి అనేక రకాల హాని కలుగుతుందనే విషయాన్ని మరిచిపోయారు. కొన్ని కారణాల వల్ల మీరు కొన్నిసార్లు ఆలస్యంగా తింటే దానితో సమస్య లేదు. కానీ మీలో ఎవరైనా దీన్ని అలవాటుగా మార్చుకుంటే మాత్రం పెద్ద ప్రమాదంలో పడినట్లే అని చెప్పవచ్చు. అది మీ ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాత్రి 8:00 గంటల తర్వాత భోజనం చేయడం ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే నిద్ర, ఆహారం మధ్య 2 గంటల గ్యాప్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఆలస్యంగా తినడం లేదా తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే, శరీరంలోని జీవక్రియలు నెమ్మదిగా పని చేయడం మానేస్తాయి.. దీంతో రాబోయే రోజుల్లో మీకు అనేక రకాల వ్యాధులు చుట్టుముడుతాయి. అవి ఎలాంటి సమస్యలు వస్తాయో ఓ సారి తెలుసుకుందాం..
నేటి కాలంలో యువత ఒబేసిటీతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. జిమ్ ఎక్సర్సైజులు చేసినా ఊబకాయం మాత్రం తగ్గడం లేదు. దీనికి కారణం రాత్రిపూట ఆలస్యంగా తినడం తప్ప మరొకటి కాదు. మీ బరువును అదుపులో ఉంచుకుంటే.. ఖచ్చితంగా ఆహారం, నిద్ర మధ్య 2 నుంచి 3 గంటల గ్యాప్ ఉంచండి.
తరచుగా నిద్రలేమి గురించి వైద్యులను సంప్రదిస్తున్న వారి సంఖ్య ఈ మధ్యాకలంలో చాలా పెరిగిపోయింది. మీరు ఆహారం ఆలస్యంగా తినడం వల్ల ఇది జరుగుతుందని వైద్యులు చెబుతుంటారు. అయినా వారి రోజు వారి దినచర్య మాత్రం మారదు. ఇలా ఆలస్యంగా తినడం వల్ల మీ శరీర సహజ చక్రాన్ని ప్రభావితం చేస్తుంది. రాత్రి నిద్రపోతున్నప్పుడు మీరు ఇబ్బందిగా ఫీలవుతారు. దీంతో మీరు ప్రశాంతంగా నిద్రపోలేకపోతారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, నిరంతరం ఆలస్యంగా తినడం వల్ల మీకు బీపీ, కొలెస్ట్రాల్, మధుమేహ సమస్యలు వస్తాయి. క్రమం తప్పకుండా ఆలస్యంగా భోజనం చేయడం ద్వారా మీ బరువు పెరుగుతుంది. రక్తంలో చక్కెర అదుపు లేకుండా ఉంటుంది. దీని వల్ల బీపీ, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
రాత్రి భోజనం చేసిన తర్వాత, మీరు నేరుగా పడుకుంటారు. అటువంటి పరిస్థితిలో మీకు ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి అనేక సమస్యలు వస్తాయి. ఎందుకంటే మీరు ఆహారం తిన్న తర్వాత ఎటువంటి కార్యకలాపాలు చేయరు. దీని కారణంగా, ఆహారం జీర్ణం కావడానికి సమయం పడుతుంది. ఇది మీ జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది.
మీరు రాత్రిపూట ఆలస్యంగా తింటే, రెండవ రోజు మీకు మలబద్ధకం, తలనొప్పి, ఇతర సమస్యలు మొదలవుతాయి. ఇది మీ శక్తి స్థాయిని తగ్గిస్తుంది. చాలా సార్లు రాత్రి ఆలస్యంగా తినడం వల్ల మీకు నిద్ర రాదు. దీని కారణంగా మీరు కూడా తలనొప్పి సమస్య మొదలవుతుంది. దీంతో మీ రోజంతా వృధా అవుతుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం