Iron deficiency: శరీరంలో క్రమంగా రక్తం తగ్గడం వలన అనేక వ్యాధుల భారిన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రాణానికి మరింత డేంజర్. శరీరంలో రక్తం తక్కువగా ఉండడం అంటే రక్తహీనత అంటారు. దీనివలన కళ్లు తిరగడం, బలహీనత, తేలికపాటి తలనొప్పి, మైకం వంటి లక్షణాలను కలిగిస్తుంది. అయితే శరీరంలో ఐరన్ లోపం ఉండడం ఇందుకు కారణం. ఇందుకోసం ప్రతి సారి డాక్టర్స్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వలన ఈ రక్తహీనత సమస్యను తగ్గించవచ్చు. అవెంటో తెలుసుకుందామా.
1. శరీరంలో రక్తం మొత్తాన్ని పెంచడానికి బీట్‌రూట్ సహాయపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఐరన్ ఉంటుంది. శరీరాన్ని డిటాక్సిఫై చేయడమే కాకుండా హిమోగ్లోబిన్ శాతాన్ని కూడా పెంచుతుంది.
2. రోజుకు ఒక ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదు అంటారు. నిజమే ఆపిల్ తినడం వలన ఆరోగ్యంగా ఉండటమే కాకుండా శరీరంలో రక్తాన్ని పెంచుతుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది.
3. దానిమ్మలో కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దానిమ్మ శరీరంలో రక్తాన్ని పెంచడంలో చాలా సహాయపడుతుంది.
4. ఖర్జూరం, వాల్‌నట్, బాదం మొదలైన డ్రై ఫ్రూట్స్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటి వలన ఎర్ర రక్త కణాలు రక్తంలో వేగంగా పెరుగుతాయి.
5. మీ శరీరంలో రక్తం లోపం ఉన్నవారు…బచ్చలికూరను తీసుకోవడం మంచిది. పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.
Also Read: Health Tips: రక్తంలో ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గుతున్నాయా ? వీటిని ట్రై చేస్తే… డాక్టర్ అవసరం రానట్లే..