
GreenTurmeric: పసుపుని తినడానికి చర్మంపై పూయడానికి రెండింటికి వినియోగిస్తారు. ఇది చర్మ సంరక్షణలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది చాలా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, క్రిమినాశక లక్షణాలు ఉంటాయి. అవి ఇన్ఫెక్షన్ నుంచి మనల్ని రక్షిస్తాయి. దీనిని వాడటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అత్యుత్తమ ఫలితాలను ఇస్తాయి. మార్కెట్‌లో సులువుగా లభించే పచ్చి పసుపుతో స్ట్రెచ్ మార్క్స్, మొటిమలు, ఇతర అనేక చర్మ సమస్యలు తొలగిపోతాయి. అయితే దానిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. మీ చర్మంపై నల్లటి వలయాలు ఉంటే చింతించకండి. ఎందుకంటే అవి పచ్చి పసుపుతో తొలగించవచ్చు. మీరు చేయాల్సిందల్లా రెండు చెంచాల పచ్చి పసుపు రసం తీసుకుని దానికి ఒక చెంచా నిమ్మరసం కలపండి. సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని కంటి కింద భాగంలో అప్లై చేసి కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగితే మంచి ఫలితాలు ఉంటాయి.
యాంటీ ఏజింగ్ ఏజెంట్
పచ్చి పసుపుని యాంటీ ఏజింగ్ ఏజెంట్ అని కూడా పిలుస్తారు. మీరు అకాల ముడతలు, ఫైన్ లైన్లను వదిలించుకోవాలనుకుంటే పచ్చి పసుపుతో ఫేస్ ప్యాక్ తయారు చేసి ముఖానికి అప్లై చేయండి. రెండు చెంచాల పచ్చి పసుపు రసం తీసుకుని దానికి బాదం పొడి, పచ్చి పాలు కలపండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి కొంత సమయం తర్వాత సాధారణ నీటితో కడగండి. ఇలా వారానికి రెండుసార్లు చేయండి కొన్ని రోజుల తర్వాత తేడాను గమనిస్తారు.
స్ట్రెచ్ మార్క్స్ కనిపించకుండా చేస్తాయి
చాలా మంది మహిళల్లో గర్భధారణ తర్వాత స్ట్రెచ్ మార్క్స్ సమస్యలు ఉంటాయి. పచ్చి పసుపుతో వాటిని చాలా వరకు అధిగమించవచ్చు. పచ్చి పసుపు రసం, నిమ్మరసం, ఆలివ్ నూనెతో కలిపి పేస్టులా చేయండి. దీనిని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట అప్లై చేసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. కొన్ని రోజులలో ఫలితం చూస్తారు.