Tips for Night duty: నైట్ డ్యూటీ చేస్తున్నారా..? అయితే, తప్పని అనారోగ్య సమ్యలు..! వీటితో చెక్ పెట్టేయండి.. వీడియో
మీరు నైట్ డ్యూటీ చేస్తున్నారా..? అయితే, ఇది మీ కోసమే..పగలంతా ఖాళీగా ఉండి రాత్రి పని చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. రాత్రి సమయంలో డ్యూటీ చేసే వాళ్లు పగలంతా చాలా సమయం దొరుకుతుంది కదా అని ఏవేవో పనులు చేసుకుంటూ ఉంటారు.
మీరు నైట్ డ్యూటీ చేస్తున్నారా..? అయితే, ఇది మీ కోసమే..పగలంతా ఖాళీగా ఉండి రాత్రి పని చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. రాత్రి సమయంలో డ్యూటీ చేసే వాళ్లు పగలంతా చాలా సమయం దొరుకుతుంది కదా అని ఏవేవో పనులు చేసుకుంటూ ఉంటారు. కరోనా అనంతరం చాలామంది వర్క్ ఫ్రం హోం పేరిట నైట్ డ్యూటీ లు చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో డ్యూటీలు చేసే వారికి గుండె సమస్యలు అలాగే డయాబెటిస్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ఇటీవల జరిగిన ఒక అధ్యయనం లో వెల్లడయింది.అమెరికాకు చెందిన టారో వర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో కొన్ని షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. ఎప్పుడైతే రాత్రిపూట నిద్ర పోకుండా పనులు చేస్తారో అలాంటి వారికి నిద్రలేమి సమస్యతో పాటు గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. జీవక్రియలు మందగిస్తాయి. బిపి, షుగర్, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం లాంటి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ఈ విషయంలో నిర్లక్ష్యం కొనసాగితే జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడి.. పొట్ట సంబంధిత సమస్యలు కూడా ఎదురవుతాయి. నైట్ షిఫ్ట్ చేసేవాళ్లు ప్రతిరోజు 6 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. తగిన వ్యాయామం చేయడం.. ఆరోగ్యానికి కావలసిన పోషకాలు కలిగిన ఆహారాలు తీసుకోవడం వంటివి చేయడం వల్ల వచ్చే సమస్యలను దూరం చేసుకోవచ్చు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్ స్టిల్స్.. అప్పుడే యాక్టింగ్ మొదలెట్టిందా..!
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..