AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salt: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉప్పు.. కిలో ధర తెలిస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే

మనం రోజువారీ ఆహారంలో ఉపయోగించే సాధారణ ఉప్పు కిలో ధర ఎంత ఉంటుంది? మహా అయితే కొన్ని వందలు, అది కూడా హిమాలయన్​ సాల్ట్​, పింక్​ సాల్ట్​ వంటి అరుదైన రకాలు అయితేనే..! కానీ ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఉప్పు ఒకటి ఉంది. దాని ..

Salt: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉప్పు.. కిలో ధర తెలిస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే
Bamboo Salt 1
Nikhil
|

Updated on: Dec 07, 2025 | 9:31 AM

Share

మనం రోజువారీ ఆహారంలో ఉపయోగించే సాధారణ ఉప్పు కిలో ధర ఎంత ఉంటుంది? మహా అయితే కొన్ని వందలు, అది కూడా హిమాలయన్​ సాల్ట్​, పింక్​ సాల్ట్​ వంటి అరుదైన రకాలు అయితేనే..! కానీ ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఉప్పు ఒకటి ఉంది. దాని పేరు కొరియన్ వెదురు ఉప్పు లేదా జుమ్‌యామ్. దీని ధర కిలోకు దాదాపు రూ.35,000 వరకు ఉంటుంది. ఇది ఇంత ఖరీదుగా ఉండటానికి, ఇంతటి ప్రాముఖ్యత పొందడానికి కారణం కేవలం దాని అద్భుతమైన తయారీ ప్రక్రియే. ఈ ఉప్పు ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం..

ఎలా చేస్తారు..

  • ఈ ఉప్పును కొరియాలోని పశ్చిమ సముద్ర తీరాలలో సేకరించిన స్వచ్ఛమైన సముద్రపు ఉప్పుతో తయారు చేస్తారు.
  • ఈ ఉప్పును మూడు సంవత్సరాలు పెరిగిన, నాణ్యమైన వెదురు కాండాలలో నింపుతారు.
  • ఈ వెదురు కాండాల రెండు చివరలను స్థానికంగా లభించే అగ్నిపర్వత మూలం ఉన్న ఎర్రటి మట్టితో గట్టిగా మూసివేస్తారు.
  • అసలైన అద్భుతం ఇక్కడే ఉంది. ఈ నింపిన వెదురు కాండాలను ప్రత్యేకమైన పైన్ కొయ్య బొగ్గుతో తయారు చేసిన పొయ్యిలో ఉంచి, దాదాపు 1000°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కాల్చుతారు. ఈ కాల్చే ప్రక్రియను ఏకంగా తొమ్మిదిసార్లు పునరావృతం చేస్తారు. ఈ తొమ్మిదిసార్లు కాల్చడం వల్లనే దీనికి అంతటి విలువ.
  • ఈ సంక్లిష్ట ప్రక్రియలో వెదురు కాండాలు, ఎర్రటి మట్టిలోని అత్యంత విలువైన ఖనిజాలు ఉప్పులోకి పూర్తిగా ఇంకిపోతాయి. దీనివల్ల సాధారణ ఉప్పు కంటే ఇందులో మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి.

ఆరోగ్య ప్రయోజనాలు

తొమ్మిదిసార్లు కాల్చిన ఈ ఉప్పును అత్యంత పోషకమైనదిగా, ఔషధ గుణాలు కలదిగా కొరియన్లు భావిస్తారు. ఈ ఉప్పు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, రక్తంలోని విషాన్ని తొలగిస్తుంది, నోటి దుర్వాసనను తగ్గిస్తుంది, శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుందని అక్కడి సాంప్రదాయ వైద్యంలో విశ్వసిస్తారు.

ఖరీదైన రెస్టారెంట్‌లలో దీనిని ప్రత్యేక వంటకాలకు ఉపయోగిస్తారు. ఈ అసాధారణమైన తయారీ ప్రక్రియ, శ్రమ, దాని అరుదైన ఆరోగ్య ప్రయోజనాల కారణంగానే ఈ వెదురు ఉప్పు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాలలో ఒకటిగా నిలిచింది.