Cancer: ఈ ఐదు రకాల ఆహార పదార్థాలు తీసుకుంటే క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు..!

|

Mar 07, 2022 | 5:59 PM

ఈ మధ్య చాలా మంది క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు క్యాన్సర్ ప్రధాన కారణమని వెల్లడిస్తుంది..

Cancer: ఈ ఐదు రకాల ఆహార పదార్థాలు తీసుకుంటే క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు..!
Food
Follow us on

ఈ మధ్య చాలా మంది క్యాన్సర్(Cancer) బారిన పడి చనిపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు క్యాన్సర్ ప్రధాన కారణమని వెల్లడిస్తుంది. దురదృష్టకర విషయం ఏమిటంటే.. ఈ క్యాన్సర్‌కు ఇప్పటికి మందు లేకపోవడం. అయితే కొన్ని సూపర్‌ఫుడ్‌లు క్యాన్సర్-పోరాట లక్షణాలను కలిగి ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. సూపర్‌ఫుడ్‌(Superfood)లు క్యాన్సర్‌తో పోరాటం చేయడమే కాకుండా హృదయ(heart) సంబంధ వ్యాధులు, మధుమేహం మొదలైన అనేక ఆరోగ్య సమస్యలతో పోరాడగలదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

ప్రతిరోజూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. క్యాన్సర్‌పై అనేక అధ్యయనాలు తమ ఫైటోన్యూట్రియెంట్లు, ఇతర ప్రత్యేక సమ్మేళనాల కోసం మొక్కల ఆధారిత ఆహారాన్ని తినాలని ప్రజలను కోరుతు్నారు. కాబట్టి క్యాన్సర్‌ను నిరోధించడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన కొన్ని సూపర్‌ఫుడ్స్ ఏమిటో తెలుసుకుందాం..

బెర్రీలు: వీటిలో మినరల్స్, విటమిన్లు, డైటరీ ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. దాని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కల్పిస్తాయి. బ్లూబెర్రీస్ శోథ నిరోధక ప్రభావాలు ఎలుకలలో రొమ్ము క్యాన్సర్ కణుతుల పెరుగుదలను నిరోధిస్తాయని ఒక అధ్యయనం పేర్కొంది.

బ్రోకలీ: ఈ ఆకుపచ్చ కూరగాయ ఫైటోకెమికల్స్‌కు పవర్‌హౌస్, ఫైటోకెమికల్స్ క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి ఇతర క్రూసిఫరస్ కూరగాయలలో కూడా చూడవచ్చు. ఇవి ప్రోస్టేట్, ఊపిరితిత్తులు, పెద్దప్రేగు, రొమ్ము, మూత్రాశయం, కాలేయం, మెడ, తల, నోరు, అన్నవాహిక, కడుపు వంటి క్యాన్సర్ల నుంచి చాలా రక్షణగా ఉంటాయి.

ఆపిల్: యాపిల్స్‌లో ఉండే పాలీఫెనాల్‌కు యాంటీ కాన్సర్ లక్షణాలు ఉన్నాయి. ఇది మాత్రమే కాదు.. మొక్క ఆధారిత సమ్మేళనాలు పాలీఫెనాల్స్ హృదయ సంబంధ వ్యాధులు, అనేక ఇన్ఫెక్షన్లకు చాలా సహాయకారిగా ఉంటాయి.

వాల్నట్: క్యాన్సర్‌తో పోరాడుతున్నప్పుడు అన్ని గింజలు ఆరోగ్యకరంగా మారుతాయని అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ పేర్కొంది. అయితే ఇతర గింజలతో పోలిస్తే వాల్‌నట్‌పై ఎక్కువగా పరిశోధించారు. ఇందులో పాలీఫెనాల్స్, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్, ఫైటోస్టెరాల్స్, మెలటోనిన్, టానిన్స్ (ప్రోయాంతోసైనిడిన్స్, ఎల్లాజిటానిన్స్) ఉంటాయి. ఈ లక్షణాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించగలవు.

టొమాటో: టమాటాలు తింటే ప్రోస్టేట్ క్యాన్సర్, గుండె జబ్బుల నుంచి రక్షణ పొందవచ్చు. ఇందులో కూడా ఫైటోకెమికల్స్ ఉంటాయి.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Read Also.. Sugar Patients: షుగర్ ఉన్నవారు పండ్లు తినొచ్చా.. తింటే ఎలాంటి పండ్లు తినాలి..?