Amla Juice: పరగడుపున ఉసిరి రసం తాగితే అద్భుత ప్రయోజనాలు.. ఆ సమస్యలకి చక్కటి పరిష్కారం..!

|

May 29, 2022 | 1:01 PM

Amla Juice: ఉసిరికాయను సూపర్‌ఫుడ్‌గా పిలుస్తారు. ఇందులో ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు అనేక వ్యాధుల నుంచి మనల్ని రక్షించడంలో సహాయపడతాయి. ఉసిరి రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

Amla Juice: పరగడుపున ఉసిరి రసం తాగితే అద్భుత ప్రయోజనాలు.. ఆ సమస్యలకి చక్కటి పరిష్కారం..!
Amla Juice
Follow us on

Amla Juice: ఉసిరికాయను సూపర్‌ఫుడ్‌గా పిలుస్తారు. ఇందులో ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు అనేక వ్యాధుల నుంచి మనల్ని రక్షించడంలో సహాయపడతాయి. ఉసిరి రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది జలుబు-దగ్గు కలిగించే బ్యాక్టీరియా నుంచి రక్షిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇది జుట్టును బలంగా చేస్తుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీని రుచి పుల్లగా ఉంటుంది. ఉసిరి రసాన్ని పరగడుపున తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఉసిరి రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1. బరువు తగ్గడంలో సహాయపడుతుంది

పరగడుపున ఉసిరి రసం తాగడం వల్ల బరువు తగ్గుతారు. ఇది శరీర ఆకృతిని మెరుగుపరుస్తుంది. ఉసిరి రసంలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. అవి జీవక్రియను మెరుగుపరుస్తాయి. కొవ్వును కరిగించడంతో పాటు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఉసిరి రసంలో కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, శక్తిని పెంచే అంశాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

2. శరీరం నుంచి టాక్సిన్స్ తొలగిస్తుంది

పరగడుపున ఉసిరి రసం తాగడం వల్ల శరీర వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. ఇది శరీరం నుంచి హానికరమైన టాక్సిన్స్ ను తొలగిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లను తొలగిస్తుంది. ఉసిరి రసం యూరినరీ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.

3. కంటికి మేలు చేస్తుంది

కంటి చూపును పెంచడంలో ఉసిరి చాలా మంచిది. ఇందులో కెరోటిన్ ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. రోజూ ఉసిరికాయ రసాన్ని తీసుకోవడం వల్ల కంటి చూపు బాగుంటుంది. కంటి శుక్లం, చికాకు, కళ్లలో తేమ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

4. శక్తిని పెంచుతుంది

పరగడుపున ఉసిరి రసం తాగడం వల్ల రోజు మొత్తం ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఉసిరి రసం ఉదయం పూట ఎనర్జీ బూస్టర్ లేదా ఎనర్జీ డ్రింక్‌గా పనిచేస్తుంది. ఇది రోజంతా మనల్ని ఫిట్‌గా ఉంచుతుంది.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి