Omicron Test Kit: తక్కువ ధరతో ఒమిక్రాన్‌ను గుర్తించే కిట్.. మార్కెట్‌లోకి ఎప్పుడు రానుందంటే

|

Jan 07, 2022 | 8:30 PM

Tata Covid Test Kit: కోవిడ్ 19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ను గుర్తించేందుకు రూపొందించిన కిట్‌ను ఆమోదించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకటించింది. ఈ కిట్ భారత్ లో..

Omicron Test Kit: తక్కువ ధరతో ఒమిక్రాన్‌ను గుర్తించే కిట్.. మార్కెట్‌లోకి ఎప్పుడు రానుందంటే
Omicron Test Kit
Follow us on

Tata Omicron Test Kit: కోవిడ్ 19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ను గుర్తించేందుకు రూపొందించిన కిట్‌ను ఆమోదించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకటించింది. ఈ కిట్ భారత్ లో మరో వారం నుంచి పది రోజుల్లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించడానికి టాటా సంస్థ ఓ కిట్ ను రూపొందించింది. ఒమిషూర్ పేరుతో రూపొందించిన ఈ కిట్ కు ICMR ఆమోదం తెలిపింది.

టాటా మెడికల్, డయాగ్నోస్టిక్స్ తయారు చేసిన ఈ కిట్ తో ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించవచ్చు. టాటామెడికల్ , ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్  భాగస్వామ్యంతో కొత్త కరోనావైరస్ వేరియంట్ Omicron ను గుర్తించడానికి RT-PCR టెస్ట్ కిట్‌ను భారతదేశంలో అభివృద్ధి చేసినట్లు ICMR డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు.టెస్టింగ్ కిట్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) ఆమోదం తెలిపిందని ఆయన చెప్పారు.

ఈ కిట్ పరీక్షించిన నాలుగు గంటల్లో ఫలితాలను ఇస్తుంది డాక్టర్ భార్గవ తెలిపారు. దీని ధరను రూ.250 గా నిర్ణయించారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న టెస్టింగ్ కిట్లతో పోల్చుకుంటే ఒమిషూర్ ధర తక్కువగా ఉంది.ఈ టెస్ట్ కిట్ జనవరి 12 నుండి మార్కెట్లో అందుబాటులో కి రానున్నది.

శుక్రవారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం..  దేశంలో ఇప్పటివరకు 3,007 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో  1,199మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా ఓమిక్రాన్ కేసులు (876), ఢిల్లీ (465), కర్ణాటక (333) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Also Read:   ‘కుప్పంలో అటెండర్‌ను పోటీ చేయించి గెలిపిస్తా’.. చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి సవాల్..

 పంజాబ్ ఉదంతం దేనికి సంకేతం..? కాంగ్రెస్, బీజేపీల వాదనలో నిజమెంత..? సుప్రీంకోర్టులో తేలేదేంటి..?