Healthy Food: వయసు పెరిగినా తరగని అందం మీ సొంతమవ్వాలంటే.. ఇలా చేయండి..

|

Feb 17, 2022 | 4:16 PM

Healthy Food: నిత్యం యంగ్‌గా కనిపించాలనేది చాలా మంది కోరిక. ఇందుకోసమే రకరకాల బ్యూటీ టిప్స్‌ పాటిస్తుంటారు. ఫేషియల్‌, మేకప్‌ అంటూ అందాన్ని కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతుంటారు. ఇలా కోరిక ఉన్న వారి ఆశను ఆసరగా చేసుకొని..

Healthy Food: వయసు పెరిగినా తరగని అందం మీ సొంతమవ్వాలంటే.. ఇలా చేయండి..
Anti Aging Food
Follow us on

Healthy Food: నిత్యం యంగ్‌గా కనిపించాలనేది చాలా మంది కోరిక. ఇందుకోసమే రకరకాల బ్యూటీ టిప్స్‌ పాటిస్తుంటారు. ఫేషియల్‌, మేకప్‌ అంటూ అందాన్ని కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతుంటారు. ఇలా కోరిక ఉన్న వారి ఆశను ఆసరగా చేసుకొని చాలా రకాల సౌందర్య సాధనాలు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి.

అయితే వయసు పెరిగినా అందం తగ్గకుండా ఉండాలంటే కెమికల్స్‌తో కూడిన మేకప్స్‌ వాడాల్సిందేనా.? అంటే కాదని చెబుతున్నారు నిపుణులు మనం తీసుకునే ఆహారం ద్వారా కూడా నిత్యం యవ్వనంగా ఉండొచ్చని చెబుతున్నారు. ఇంతకీ నిత్య నూతనంగా, మెరిసే ఛాయతో కనిపించాలంటే తీసుకోవాల్సిన ఆహార పదార్థాలేంటో ఓ సారి చూసేయండి..

* నిత్య యవ్వనంగా కనిపించాలంటే డైట్‌లో చేర్చుకోవాల్సిన ఆహార పదార్థాల్లో నారింజ మొదటి స్థానంలో ఉంటుంది. మిటమిన్‌ సీ పుష్కలంగా ఉండే ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. అంతేకాకుండా వీటి ద్వారా చర్మం డీహైడ్రేట్‌కు గురికాకుండా ఉంటుంది.

* యాపిల్స్‌ను తీసుకుంటే డాక్డర్ అవసరం రాదని చాలా మంది నిపుణులు చెబుతుంటారు. ఇందులో ఉండే విటమిన్‌ ఏ, సీలతో పాటు యాంటీ యాక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్‌ మీ చర్మానికి రక్షణ ఇస్తుంది.

* దాదాపు 92 శాతం నీరు ఉండే పుచ్చ కాయలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా ఇందులోని విటమిన్‌ సీ, ఏ, బీ1 చర్మానికి కాంతినిస్తుంది. వయసుతో పాటు చర్మంపై వచ్చే ముడతలకు చెక్‌ పెడుతుంది.

* సిట్రస్‌ ఫ్యామిలీకి చెందిన నిమ్మకాయలు కూడా చర్మానికి ఎంతగానో ఉపయోగపడతాయి. నిమ్మరసాన్ని ముఖానికి అప్లై చేసుకుంటే మెటిమలు, మచ్చలు తగ్గుతాయనే విషయం తెలిసిందే. అయితే నిమ్మరసం రూపంలో తాగడం వల్ల కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.

* వేసవి వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చే మామిడి పండ్లు కూడా చర్మానికి మంచి చేస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్‌ ఏ, ఈ, సీ, కే, ఫ్లెవనాయిడ్స్‌ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా చర్మాన్ని ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉండేలా చూసుకుంటాయి.

* కీర దోసకాయ కూడా చర్మానికి మేలు చేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్‌లు, విటమిన్‌ సీ, కేలు చర్మం ప్రకాశవంతంగా మెరవడానికి దోహదపడతాయి.

* నిత్యం యవ్వనంగా కనిపించాలంటే డైట్‌లో చేర్చుకోవాల్సిన మరో ఫ్రూట్‌ దానిమ్మ. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఇందులోని విటమిన్స్‌, మినరల్స్‌.. యూవీ కిరణాల వల్ల చర్మానికి జరిగే డ్యామేజ్‌ను తగ్గిస్తుంది.

Also Read: Pakistan PM Imran Khan: పాకిస్తాన్‌‌లో మొదలైన రాజకీయ రచ్చ.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మెడకు బిగుస్తున్న ద్రవ్యోల్బణం ఉచ్చు..

Medaram Jathara 2022: అంగరంగ వైభవం జరుగుతున్న మేడారం జాతర ఫోటోస్

Medaram Jathara 2022: అంగరంగ వైభవం జరుగుతున్న మేడారం జాతర ఫోటోస్