ప్రస్తుత కాలంలో ఆరోగ్య సమస్యలు అంటే సర్వసాధారణ విషయంగా మారిపోయింది. కానీ మనం ఆరోగ్యంగా ఉండాలంటే పోషక విలువలున్న సమతుల్య ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఈ కోవకు చెందినదే బెల్లం శనగపప్పు. ఇవి రెండు కలిపి తినడం శరీరానికి చాలా మంచిది. ఈ రెండింటిలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఎన్నో రకాల వ్యాధులను కూడా దూరం చేయడంతో పాటు ఆనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. మరి బెల్లం, శనగపప్పులను కలిపి తినడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.