Benefits Of Swimming For Asthma: ఉబ్బసము తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి. అస్తమా దీర్ఘకాలంగా మనిషికి ఊపిరి అందకుండా చేస్తుంది. ఇది పిల్లలతోపాటు పెద్దవారిలోను కూడా కనిపిస్తుంది. ఈ సమస్య ఉన్నవారు శ్వాస తీసుకోవడం కష్టతరం అవుతుంది. ఈ పరిస్థితిలో వ్యాయామం చేయడం కష్టంగా మారుతుంది. అయినప్పటికీ, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, బరువును తగ్గించుకోవాడానికి, వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి కొన్ని రకాల వ్యాయామాలు చేయడం చాలా ముఖ్యం. ఆస్తమాతో బాధపడుతున్న వారు ఈత కొడితే చాలామంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది అస్తమా బాధితులకు ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు. శ్వాశ తీసుకునే పరిస్థితిపై నియంత్రణను పొందడంలో ఈత సహాయపడుతుంది. అలాగే మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఆస్తమా లక్షణాలు గణనీయంగా తగ్గుతాయి. ఆస్తమాతో బాధపడేవారికి వారి లక్షణాలను తగ్గించడం కోసం స్విమ్మింగ్ ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి