Kitchen Hacks: పచ్చిమిర్చి ఘాటుగా ఉందని తినడం లేదా ? ఈ విషయాలు తెలుసుకోండి!!

|

Aug 12, 2023 | 10:46 PM

పచ్చిమిర్చి.. కూరగాయల జాతికి చెందినదే. రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో పచ్చిమిర్చి పచ్చడి కూడా చేసుకుని తింటారు. మనం రోజూ చేసే వంటల్లో ఉల్లిపాయ, ఉప్పు వాడటం ఎంత సాధారణమో.. పచ్చిమిర్చిని కూడా అదే విధంగా వాడుతాం. కొందరు ఒక కూరలో ఒక్క పచ్చిమిర్చే వేస్తే.. ఇంకొందరు తినే ఘాటును బట్టి.. 2-3 వేసుకుంటారు. నాన్ వెజ్ వంటల్లో అయితే.. ఎన్ని పచ్చిమిర్చి వేస్తారో..

Kitchen Hacks: పచ్చిమిర్చి ఘాటుగా ఉందని తినడం లేదా ? ఈ విషయాలు తెలుసుకోండి!!
Green Chilli Benefits
Follow us on

పచ్చిమిర్చి.. కూరగాయల జాతికి చెందినదే. రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో పచ్చిమిర్చి పచ్చడి కూడా చేసుకుని తింటారు. మనం రోజూ చేసే వంటల్లో ఉల్లిపాయ, ఉప్పు వాడటం ఎంత సాధారణమో.. పచ్చిమిర్చిని కూడా అదే విధంగా వాడుతాం. కొందరు ఒక కూరలో ఒక్క పచ్చిమిర్చే వేస్తే.. ఇంకొందరు తినే ఘాటును బట్టి.. 2-3 వేసుకుంటారు. నాన్ వెజ్ వంటల్లో అయితే.. ఎన్ని పచ్చిమిర్చి వేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాంబార్, ఆంధ్రా స్పెషల్ పప్పుచారు వంటి డిష్ లలో అయితే సరే సరి.

ఇంకా రోటి పచ్చళ్లలో, పల్లీల చట్నీలలో పచ్చిమిర్చిలను తెగవాడేస్తుంటాం. అయితే.. కొందరు మిర్చిని ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. కారం ఎక్కువ తినడం ఆరోగ్యానికి అంతమంచిది కాదని వారి భావన. అయితే పచ్చిమిర్చిలో కూడా మన శరీరానికి కావలసిన పోషకాలున్నాయి. అయితే వీటిని అవసరమైన మోతాదులో తీసుకుంటే.. ఎలాంటి సమస్య ఉండదు. పచ్చిమిర్చి వల్ల కలిగే ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

కంటిచూపు మెరుగుపడుతుంది: ప్రతిరోజూ ఒక పచ్చిమిర్చిని తింటే కంటిచూపు మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఇందులో కాపర్, నియాసిన్, విటమిన్ B6, మెగ్నీషియం, ఫైబర్, ఐరన్, ఫోలేట్ ఎన్నో పోషకాలుంటాయి.

ఇవి కూడా చదవండి

రక్త ప్రసరణ వేగవంతం అవుతుంది: పచ్చిమిర్చిని తింటే శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. లో బీపీ ఉన్నవారు పచ్చిమిర్చి తింటే.. ఆ సమస్య తగ్గుతుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక అనారోగ్య సమస్యలు కూడా దరిచేరకుండా ఉంటాయి.

జీర్ణ వ్యవస్థ చక్కగా ఉంటుంది: పచ్చిమిర్చిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్ ను చంపి.. మనల్ని అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుతాయి. రోజూ ఒక పచ్చిమిర్చి తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.

సైనస్-కీళ్ల నొప్పులు మాయమవుతాయి: సైనస్ తో బాధపడేవారికి పచ్చిమిర్చి మంచి ఔషధంలా పనిచేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా పచ్చిమిర్చి అదుపుచేస్తుంది. అలాగే వైరస్, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు. పచ్చిమిర్చిలో ఉండే గింజల్ని నువ్వులనూనెలో వేసి వేడిచేసి.. ఆ నూనెను కీళ్లనొప్పులు ఉన్నప్రాంతంలో రాస్తే.. నొప్పులు తగ్గుతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి