Natural Remedies for Tooth Pain: పంటి నొప్పి ఎంత బాధిస్తుందో ఆ అనుభవాన్ని ఎదుర్కొన్న వారికే తెలుస్తుంది. సహజంగా పుప్పిళ్లు, దంతాళ్లో పగుళ్లు, చిగుర్లు ఉబ్బడం వల్ల పంటినొప్పి సమస్య వస్తుంది. అయితే పుప్పిళ్లు వంటి పెద్ద పెద్ద సమస్యలు వస్తే ఎలాగూ.. వైద్యులను సంప్రదించాల్సిందే. అలా కాకుండా సాధారణ పంటి నొప్పి, చిగుళ్లు ఉబ్బడం వల్ల కలిగే నొప్పిని కొన్ని సహజ పద్ధతుల ద్వారా తగ్గించుకోవచ్చనే విషయం మీకు తెలుసా.? పంటి సమస్యలకు చెక్ పెట్టే కొన్ని సహజ పద్ధతులపై ఓ లుక్కేయండి.
* ఉన్నపలంగా పంటి నొప్పి వస్తే ఐస్ ముక్కలతో ఉపశమనం పొందవచ్చు. ఒక పలుచటి గుడ్డలో కొన్ని ఐస్ ముక్కలను తీసుకొని నొప్పిగా ఉన్న పంటిపై నెమ్మదిగా ఒత్తాలి దీంతో నొప్పి నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు.
* ఇక పంటి నొప్పిని తగ్గించడంలో వెల్లుల్లి కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే యాంటి బయోటిక్ గుణాలు తీవ్రమైన పంటి నొప్పి నుంచి కూడా వెంటనే రిలీఫ్ అందిస్తుంది. వెల్లుల్లిని బాగా దంచి అందులో కొంచెం ఉప్పు లేదా మిరియాల పొడి కలిపి నొప్పిగా ఉన్న పంటిపై ఉంచితే ఫలితం ఉంటుంది.
* కొన్నిసార్లు దంతాల్లో పేర్కొన్న వ్యర్థాల కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్ ద్వారా కూడా పంటి నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గోరు వెచ్చటి నీటిలో కాస్త ఉప్పు వేసి నోట్లో వేసుకొని బాగా పుకిలించాలి. దీంతో దంతాల చుట్టూ, మధ్య పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు పోతాయి. నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
* లవంగాలు కూడా పంటి నొప్పికి మంచి చిట్కాగా ఉపయోగపడతాయి. నొప్పి ఉన్న పంటిపై లవంగాన్ని పెట్టి నెమ్మదిగా నొక్కాలి దీంతో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
* ఇక చిగుళ్ల నొప్పికి చెక్ పెట్టడానికి ఆవ నూనెలో ఒక చిటికెడు ఉప్పును కలిపి చిగుళ్లపై మర్దన చేస్తే ఉపశమనం లభిస్తుంది.
* అప్పుడే కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కను నొప్పిగా ఉన్న పంటిపై ఉంచుకోవడం వల్ల అప్పటికప్పుడు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
* ఇక పంటి నొప్పి ఉన్న సమయంలో తీపి పదార్థాలు, కూల్ డ్రింక్స్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. దీనివల్ల సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది.
* పుదీనా కూడా పంటి నొప్పిని తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
Also Read: Food For Sleep: నిద్రలేమితో సతమతమవుతున్నారా..? అయితే ఇవి తినండి.. తిండికి నిద్రకు లింక్ ఏంటనేగా..