Stress Relief: నిత్యం ఒత్తిడితో సతమతమవుతున్నారా..? అయితే ఈ పద్దతులు పాటించండి..

|

Jul 09, 2021 | 11:57 AM

Stress Relief Exercises: అసలే ఉరుకుల పరుగుల జీవితం.. ఓ వైపు పని భారం.. మరోవైపు కుటుంబ బాధ్యతలు ఇవన్నీ మనిషి ఒత్తిడికి గురికావడానికి కారణమవుతున్నాయి. దీంతోపాటు సరైన తిండి, నిద్ర లేకపోవడం

Stress Relief: నిత్యం ఒత్తిడితో సతమతమవుతున్నారా..? అయితే ఈ పద్దతులు పాటించండి..
Stress
Follow us on

Stress Relief Exercises: అసలే ఉరుకుల పరుగుల జీవితం.. ఓ వైపు పని భారం.. మరోవైపు కుటుంబ బాధ్యతలు ఇవన్నీ మనిషి ఒత్తిడికి గురికావడానికి కారణమవుతున్నాయి. దీంతోపాటు సరైన తిండి, నిద్ర లేకపోవడం కూడా స్ట్రెస్ పెరిగేందుకు కారణమవుతున్నాయి. ఈ బిజీ బిజీ లైఫ్‌లో ఒత్తిడి నుంచి బయట పడలేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఫలితంగా ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటారు. స్ట్రెస్ కారణంగా ముఖ్యంగా హార్ట్ ఎటాక్, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కావున ఒత్తిడిని దూరం చేసుకోవడానికి సమయాన్ని కేటాయిస్తూ.. చిన్న చిన్న చిట్కాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒత్తిడిని దూరం చేసుకోవడానికి మెడిటేషన్, వాకింగ్ చేయడం, కుటుంబ సభ్యులతో, స్నేహితులతో గడపడం లాంటివి చేస్తే కాస్త రిలీఫ్‌గా ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే ప్రతిరోజు ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొన్ని పద్దతులు పాటిస్తే.. మేలని నిపుణులు పేర్కొంటున్నారు. ఆ పద్దతులు, సలహాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ఇలా చేయండి..
➼ ఒత్తిడి ఎక్కువగా ఉండే సమయంలో పది నిమిషాల పాటు వాకింగ్ చేయడం మంచిది. ఇంట్లో కానీ.. బయట పరిసరాల్లో కానీ నడిస్తే.. కాస్త ఒత్తిడి తగ్గుతుంది.
➼ ఇంకా స్నానం చేసేటప్పుడు నీటిలో కొద్దిగా ఉప్పు కానీ, గులాబీరేకులు, రోజ్ ఆయిల్, రెండు స్పూన్లు బాదం ఆయిల్ వేసి స్నానం చేస్తే మంచి రిలీఫ్ దొరుకుతుంది.
➼ ప్రతిరోజూ వ్యాయామం వల్ల కూడా ఒత్తిడి దూరం అవుతుంది. కాసేపు శ్వాస తీసుకొని వదలుతూ.. యోగా ఆసనాలు వేయడం ద్వారా కూడా రిలాక్స్‌గా ఉండవచ్చు.
➼ దీంతోపాటు ప్రతిరోజూ మీకు ఇష్టమైన వారితో, కుటుంబసభ్యులతో మాట్లాడటం వల్ల కూడా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
➼ టెన్షన్ నుంచి బయట పడాలంటే పాజిటివ్‌గా ఆలోచించడం, ప్రతి విషయాన్ని పాజిటివ్‌గా తీసుకోవడం నేర్చుకోవాలి.
➼ ఇలా చేయడం వల్ల ఇబ్బందులు పూర్తిగా దూరమై ఆనందంగా ఉండడానికి వీలవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
➼ ప్రతిరోజూ సమయానికి నిద్రపోవడం మంచిది.
➼ ఇంకా మనం ఆహారపు అలవాట్లను కూడా మార్చుకుంటే మంచిదని నిపుణలు సూచిస్తున్నారు.

Also Read:

Mushrooms : పుట్టగొడుగుల సాగుతో అధిక లాభాలు..! తక్కువ ఖర్చు ఎక్కువ రాబడి.. భూమిలేనివారు కూడా ట్రై చేయవచ్చు..

UP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల ఎఫెక్ట్.. రెచ్చిపోయిన ప్రత్యర్థులు.. పోటీ చేస్తున్న మహిళ చీరను లాగి…