Joint Pains: కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా.. జాగ్రత్త ఈ అవయవాలపై ఎఫెక్ట్..!

|

Mar 03, 2022 | 9:15 PM

Joint Pains: మీరు వెన్ను, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా.. రాత్రిపూట సరిగ్గా నిద్రపోలేకపోతున్నారా.. అయితే వెంటనే వైద్యులను సంప్రదించండి. ఎందుకంటే స్పాండిలైటిస్ వ్యాధికి గురయ్యే

Joint Pains: కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా.. జాగ్రత్త ఈ అవయవాలపై ఎఫెక్ట్..!
Arthritis
Follow us on

Joint Pains: మీరు వెన్ను, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా.. రాత్రిపూట సరిగ్గా నిద్రపోలేకపోతున్నారా.. అయితే వెంటనే వైద్యులను సంప్రదించండి. ఎందుకంటే స్పాండిలైటిస్ వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉంది. ఇది గుండె, ఊపిరితిత్తులు, ప్రేగులతో సహా శరీరంలోని అనేక భాగాలపై ప్రభావం చూపుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. స్పాండిలైటిస్‌ను విస్మరిస్తే తీవ్రమైన వ్యాధుల ప్రమాదానికి గురికావాల్సి ఉంటుంది. ఇది పెద్దప్రేగులో మంటకు దారి తీస్తుంది. కంటి ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. స్పాండిలైటిస్ అనేది ఒక రకమైన ఆర్థరైటిస్. ఇందులో నడుము నుంచి నొప్పి మొదలై వెన్ను, మెడ బిగుసుకుపోవడంతో పాటు శరీరం కింది భాగంలో, తొడలు, మోకాళ్లు, చీలమండల్లో నొప్పి ఉంటుంది. స్పాండిలైటిస్‌లో కీళ్లలో మంట, వాపు కారణంగా భరించలేని నొప్పి ఉంటుంది.

ప్రస్తుతం యువతలో స్పాండిలైటిస్‌ సమస్యలు ఎక్కువవుతున్నాయి. సాధారణంగా 45 ఏళ్లలోపు పురుషులు, స్త్రీలలో ఇది ఎక్కువగా వస్తుంది. ఆంకైలోజింగ్ స్పాండిలైటిస్ అనేది ఒక సాధారణ రకమైన ఆర్థరైటిస్. ఇది వెన్నుపాముని ప్రభావితం చేస్తుంది. తీవ్రమైన నొప్పి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇందులో భుజాలు, తుంటి, పక్కటెముకలు, చీలమండలు, చేతులు, కాళ్ళ కీళ్లలో నొప్పి ఉంటుంది. ఇది కళ్ళు, ఊపిరితిత్తులు, గుండెపై ప్రభావం చూపుతుంది. కీళ్లలో నొప్పి సమస్య ఉంటే అది వయస్సుతో పాటు పెరుగుతుంది. HLA-B27 పరీక్ష చేయించుకోవడం ద్వారా స్పాండిలైటిస్ నిర్ధారణ అవుతుంది. HLA-B27 అనేది రక్త పరీక్ష ద్వారా కనుగొనబడే ఒక రకమైన జన్యువు. ఇందులో బ్లడ్ శాంపిల్ తీసుకుని ల్యాబ్ లో పరీక్షిస్తారు. ఇది కాకుండా MRI స్పాండిలైటిస్‌ను ద్వారా కూడా వెల్లడవుతుంది.

Diabetes: మధుమేహ బాధితులు అలర్ట్‌.. పరగడుపున షుగర్ లెవల్స్‌ ఎందుకు పెరుగుతాయో తెలుసా..?

ఆడపిల్లల చదువు, పెళ్లి కోసం బాధపడవద్దు.. ఈ స్కీంలో పెట్టుబడి పెడితే చాలు..!

Viral Photos: బాయ్‌ఫ్రెండ్‌ కోసం వెతుకుతున్న 3 అడుగుల మోడల్.. పెళ్లి చేసుకొని సెటిల్‌ అవుతుందట..!