Sperm Cells: మీలో అవి తక్కువగా ఉండి బలహీనంగా ఉన్నాయా..? ఈ ఆహార పదార్థాలను తీసుకోండి

|

Dec 28, 2021 | 8:14 PM

Sperm Cells:ప్రస్తుతం ఉన్న జీవన విధానంలో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. తినే ఆహారం, పోల్యూషన్‌, నిద్రలేమితనం, అధిక ఒత్తిడి, విశ్రాంతి లేకుండా పని చేయడం..

Sperm Cells: మీలో అవి తక్కువగా ఉండి బలహీనంగా ఉన్నాయా..? ఈ ఆహార పదార్థాలను తీసుకోండి
Follow us on

Sperm Cells:ప్రస్తుతం ఉన్న జీవన విధానంలో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. తినే ఆహారం, పోల్యూషన్‌, నిద్రలేమితనం, అధిక ఒత్తిడి, విశ్రాంతి లేకుండా పని చేయడం తదితర కారణాల వల్ల వివిధ రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక స్త్రీ, పురుషుల్లో ఎన్నో సమస్యలు ఉంటాయి. వీరు ఒకే రకమైన ఆహారం తీసుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడం, కణాల సంఖ్య బలహీనంగా ఉండటం లాంటి సమస్యలు చాలా మంది పురుషుల్లో ఉంటుంది. వీరు తగిన ఆహారం తీసుకుంటే వీర్యకణాలు పెంచుకునే అవకాశం ఉంటుందని, పైగా కణాలు బలహీనంగా ఉండకుండా బలంగా ఉండేందుకు దోహదపడుతుందంటున్నారు.
మహిళలతో పోలిస్తే ఎక్కువ క్యాలరీలు ఉన్న భోజనం తీసుకోవడం మంచిది. పలు రకాల ఆహారాలు తీసుకుంటే వీర్య కణాలు పెంచుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

పాలకూర:
ఇందులో పోలెట్‌తో పుష్కలంగా ఉండి రక్త ప్రవాహాన్ని ఎంతగానో మెరుగుపరుస్తుంది. పురుషుల లైంగిక విధులలో పాలకూరలో ఉండే పోలిక్‌ ఆమ్లం కీలక పాత్ర పోషిస్తుంటుంది. అలాగే అంగస్తంభనకు కూడా ఉపయోగంగా ఉంటుందని ఓ అధ్యయనం ద్వారా తేలింది. ఒక కప్పు పాలకూరతో దాదాపు 77 శాతం పోలెట్‌ సమకూరుతుందని చెబుతున్నారు. దీంతో పాటు శరీరానికి తగినంత మెగ్నీషియం లభిస్తుంది. ఇది టెస్టోస్టిరాన్‌ను ప్రేరేపించేలా చేస్తుంది.

అవకాడో:
అవకాడోలో విటమిన్‌ -ఇ సమృద్దిగా ఉంటుంది. ఇది పురుషుల్లో వీర్యకణాలు బలహీనంగా ఉండకుండా బలంగా ఉండేలా చేస్తుంది. రోజువారీ వారి ఆవకాడతో దాదాపు 21 శాతం వరకు విటమిన్‌ వచ్చి చేరుతుంది. ఇక 9 శాతం వరకు జింక్‌ అందుతుంది. పురుషుల్లో వీర్యకణాల నాణ్యతతో పాటు టెస్టోస్టిరాన్‌ ఉత్పత్తి, లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆవకాడో శరీరంలో పేరుకు పోయిన చెడు కొలెస్ట్రాల్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది.

క్యారెట్‌:
క్యారెట్‌లో కూడా ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి. ఇది వీర్యకణాల నాణ్యతకు ఉపయోగపడుతుంది. పురుషుల వంధత్వ సమస్యలకు క్యారెట్ల చెక్‌ పెట్టవచ్చు. క్యారెట్‌ వల్ల వీర్యకణాలు బలంగా తయారావడంతో పాటు కణాల సంఖ్య పెంచేందుకు ఉపయోగపడుతుంది. క్యారెట్లు ఎక్కువగా తినే పురుషుల్లో వీర్యకణాల పనితీరును 8 శాతం వరకు మెరుగు పరుస్తుందని అధ్యయనాల ద్వారా తేలింది.

వెల్లుల్లి:
వంటింట్లో ఉండే వెల్లుల్లితో ఎన్నో ఉపయోగాలున్నాయి. ఇందులో సెలీనియం అనే ఎంజైమ్‌ ఉంటుంది. ఇది వీర్యకణాలను పెంచేందుకు దోహదపడుతుంది. అలాగే శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేందుకు అవసరమయ్యే అలిసిన్‌ కూడా ఈ వెల్లుల్లిలో ఉంటుంది.

దానిమ్మ పండ్లు:
ఇక దానిమ్మ పండుతో కూడా ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వీర్య కణాలను పెంచేందుకు ఉపయోగపడుతాయి. కనీసం రోజులకోసారైనా దానిమ్మ పండు గింజలను తినడం మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Hair Loss: జుట్టు ఎందుకు రాలుతుంది.? బట్టతల ఎందుకు వస్తుంది.. జుట్టు బలంగా ఉండేందుకు చిట్కాలు..!

Fenugreek Leaves: మెంతి ఆకులతో ఈ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు.. ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు సుమీ..