World Sight Day: స్క్రీన్‌పై ఎక్కువ సమయం గడపుతున్నారా.. ఈ 4 కంటి సమస్యలు రావచ్చు.. నిపుణులు ఏమంటున్నారంటే..

|

Oct 13, 2022 | 6:14 PM

కంప్యూటర్ బ్లూ స్క్రీన్‌పై ఎక్కువ సమయం గడపడం వల్ల భారత్‌లో చాలా కంటి వ్యాధులు పెరుగుతున్నాయి. అవేంటంటే..

World Sight Day: స్క్రీన్‌పై ఎక్కువ సమయం గడపుతున్నారా.. ఈ 4 కంటి సమస్యలు రావచ్చు.. నిపుణులు ఏమంటున్నారంటే..
Much Time On Screen
Follow us on

కళ్లకు బ్లూ లైట్‌ను ఎక్కువ కాలం వాడడం వల్ల కళ్లు అనారోగ్యం పాలవుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఎలక్ట్రానిక్‌ పరికరాల వినియోగం వల్ల తెలియకుండానే కళ్లు ఇబ్బందిపడుతున్నాయి. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, టీవీలు లేదా మరేదైనా ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వెలువడే బ్లూ లైట్ భారత్‌లోని ప్రజలకు అనేక కంటి సమస్యలను కలిగిస్తుంది. దీనివల్ల దృష్టి మసకబారుతుంది. చాలా మంది గంటల తరబడి డెస్క్ వర్క్ చేస్తారు లేదా గంటల తరబడి మొబైల్ చూస్తూ ఉంటారు. దీని వల్ల కనురెప్పలు రెప్పవేయబడం మరిచిపోతారు..దీంతో కళ్ళు పొడిబారుతాయి. ప్రతి ఏడాది అక్టోబర్ 13ను ప్రపంచ దృష్టి దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

భారతదేశంలో లక్షలాది మంది ప్రజలు కంటిశుక్లంతో బాధపడుతున్నారు. దృష్టి లోపం వల్ల అంధులుగా మారుతున్నారని కంటి వైద్యులు తెలిపారు. గ్లాకోమాతో బాధపడుతున్న 40 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు సరైన చికిత్స లేకుండా శాశ్వతంగా అంధులుగా మారుతున్నారు. డయాబెటిక్ మాక్యులార్ ఎడెమా పూర్తిగా నయమవుతుంది. కానీ దాని కారణంగా వారి జీవితం చీకటిలో గడిచిపోతుంది.

బ్లూ స్క్రీన్‌పై ఎక్కువ సమయం గడపడం వల్ల భారతదేశంలో చాలా కంటి వ్యాధులు పెరుగుతున్నాయని చండీగఢ్‌లోని అడ్వాన్స్‌డ్ ఐ సెంటర్‌లోని విట్రియోరెటినల్ & యువియా ప్రొఫెసర్లు తెలిపారు. కంటిశుక్లం, గ్లకోమా వంటి వ్యాధులకు సకాలంలో చికిత్స అందిస్తే అంధత్వానికి దూరంగా ఉండవచ్చని నిపుణులు తెలిపారు. ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా.. ఎక్కువ సేపు స్క్రీన్‌పై దృష్టి పెట్టడం వల్ల ఏ 4 కంటి సమస్యలు ప్రజలను ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. వాటికి ఎలా చికిత్స చేయాలో నిపుణుల నుంచి తెలుసుకుందాం.

డ్రై ఐస్..

స్క్రీన్‌పై ఎక్కువ సేపు చూడటం వల్ల కళ్లు పొడిబారే సమస్య పెరుగుతుంది. ఎప్పుడైతే కనురెప్పలు ఎక్కువ సేపు రెప్ప వేయకపోతే కళ్లలో సమస్య వస్తుంది. దీని కారణంగా కళ్లు పొడిబారడం.. మంటలు రావడం వంటివి జరుగుతాయి.

కంటి అలసట:

కంటి అలసట అనేది కంప్యూటర్‌లో ఎక్కువసేపు పనిచేసిన తర్వాత లేదా మొబైల్ చూడటం వలన కళ్ళు అలసిపోయే సమస్య.

వయస్సు-సంబంధిత మచ్చలు

వయస్సు-సంబంధిత మచ్చల క్షీణత అనేది కంటి వ్యాధి.. ఇది అభివృద్ధి చెందిన దేశాలలో వృద్ధులలో దృష్టి నష్టానికి ప్రధాన కారణం. ఈ సమస్య 40-50 సంవత్సరాల వయస్సులో ఏ వ్యక్తిలోనైనా సంభవిస్తుంది. పెద్దయ్యాక ఈ సమస్యపై దృష్టి పెట్టాలి. సకాలంలో గుర్తించినట్లయితే.. ఈ వ్యాధిని నివారించవచ్చు.

మయోపియా:

హ్రస్వదృష్టి లేదా సమీప దృష్టి లోపం అనేది సుదూర వస్తువులను చూడటం కష్టంగా ఉండే సమస్య. సుదూర వస్తువులు అస్పష్టంగా కనిపిస్తాయి. స్క్రీన్‌పై ఎక్కువసేపు చూడటం వలన మీ కంటి దృష్టిని చేయి పొడవు దూరంలో ఉన్నవి మాత్రమే కనిపిస్తాయి. ఇది మీకు సమీప దృష్టిలోపం వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది.

ఈ కంటి సమస్యలకు చికిత్స ఎలా చేయాలి:

  • మీరు మీ కళ్ళు ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే.. స్క్రీన్ ను చూసే  సమయాన్ని తగ్గించుకోండి. ప్రతి అర నిమిషంకు ఓసారి కళ్ళు రెప్పవేయండి.
  • కళ్ళు పొడిబారకుండా ఉండేందుకు హైడ్రేషన్ ఐడ్రాప్స్ ఉపయోగించండి. ఈ ఐడ్రాప్ డ్రై ఐస్ సమస్యను నివారిస్తుంది.
  • స్క్రీన్ ప్రకాశాన్ని తగ్గించే విధంగా ఓవర్ హెడ్ లైటింగ్‌ను సర్దుబాటు చేయండి
  • కంప్యూటర్‌లో పని చేస్తున్నప్పుడు, స్క్రీన్ నుండి కనీసం ఒక చేయి దూరంగా ఉండండి.
  • మీరు డెస్క్ వద్ద పని చేస్తే, ప్రతి అరగంట తర్వాత 30-40 నిమిషాల విరామం తీసుకోండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం