ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం పాత్ర మనందరికీ తెలుసు. మనం తినే, తాగేవి మన శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. తల్లి లేదా తండ్రి అయ్యే ఆనందాన్ని దూరం చేసే కొన్ని అంశాలు ఉన్నాయి. సంతానం కలుగాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడున్న రోజుల్లో సంతానోత్పత్తి స్థాయి చాలా వరకు తగ్గిపోతుంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు తదితర కారణంగా సంతానం కలుగడం లేదు. దీంతో ఎంతో మంది దంపతులు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ విషయాల వల్ల సంతానోత్పత్తి స్థాయిని తగ్గించడానికి గల కారణాలు, ఇతర నష్టాల గురించి తెలుసుకోండి.
సోడా వంటి శీతల పానీయాల ఆరోగ్యానికి హానికరమనే వార్తలు ఎన్నో్ విన్నాము. వీటిని తీసుకోవడం వల్ల తల్లిదండ్రులు అయ్యే అవకాశాలు చాలా తక్కువ. నివేదికల ప్రకారం.. హార్మోన్ల సమతుల్యతను ప్రభావితం చేసే కృత్రిమ స్వీటెనర్లను వీటిలో కలుపుతారు. ఈ కృత్రిమ స్వీటెనర్ల వల్ల సంతానలేమి, గర్భస్రావం వంటి పరిస్థితులు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. అస్పార్టిక్, ఫెనిలాలనైన్ ఆమ్లాలు, అమైనో ఆమ్లాలు అని కూడా పిలుస్తారు. ఈ పానీయాలలో ఉపయోగిస్తారు. మనం వీటిని తిన్నప్పుడల్లా అవి ఇతర అమైనో ఆమ్లాలతో కలసి మన ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. వీటి వల్ల కణాలు చనిపోతాయని, స్పెర్మ్ నాణ్యత దెబ్బతింటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
నిరంతరం శీతల పానీయాలు, సోడాతో చేసిన పానీయాలు తాగే వ్యక్తి స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సోడాను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని పీహెచ్ స్థాయి మారుతుందని నిపుణులు చెబుతున్నారు. pH స్థాయిలో మార్పులు శరీరంలో పోషకాల కొరతను కూడా సూచిస్తాయి. అలాంటివి తాగడం మానుకోవడం మంచిదని సూచిస్తున్నారు. వీటికి బదులుగా పండ్ల రసాన్ని రోజు తాగడం మంచిది.రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా మారుతుంది. చక్కెరతో తయారుచేసిన ఈ రకమైన సోడాతో కూడిన శీతల పానీయం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా బలహీనపడుతుంది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నప్పుడు, జలుబు మరియు దగ్గు మాత్రమే కాకుండా, మీరు సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నప్పుడు, గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి