యోగాతో ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంచుకోవచ్చు. అదే విధంగా ఎన్నో అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. యోగాతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చెప్పడం కూడా చాలా కష్టం. అన్ని రకాల వ్యాధులకు యోగాతో పుల్ స్టాప్ పెట్టవచ్చు. ఒక్కో అనారోగ్య సమస్యలకు ఒక్కో ఆసనం ఉంటుంది. రోజూ కాస్త సయమం ఇంట్లోనే యోగా ఆసనాలు వేస్తే.. హెల్దీగా ఉండొచ్చు. ఇప్పటికే యోగాలో చాలా రకాల ఆసనాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సీతాకోక చిలుక (బటర్ ఫ్లై) ఆసనం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది వేయడం కూడా చాలా ఈజీ. ముఖ్యంగా మహిళలకు ఇది బెస్ట్ ఆసనం అని చెప్పవచ్చు. ఈ ఆసనం వేస్తే.. గర్భిణీలకు ప్రసవం సులభంగా అవుతుంది. బటర్ ఫ్లై ఆసనంతో లోయర్ హిప్, బ్యాక్స్, కండరాలను స్ట్రాంగ్ గా చేసుకోవచ్చు. మరి ఈ ఆసనంతో ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వెన్ను నొప్పి:
మీరు వెన్ను నొప్పితో బాధ పడుతున్నట్లయితే రోజూ ఈ ఆసనం ఐదు నిమిషాలు వేయడం వల్ల ఆ సమస్య నుంచి బయట పడొచ్చు. రెగ్యులర్ గా సీతాకోక చిలుక ఆసనం వేస్తే వెన్ను నొప్పి తగ్గుతుంది.
తలనొప్పి, ఒత్తిడికి చెక్:
బటర్ ఫ్లై ఆసనం వేయడం వల్ల మెడ, తల నొప్పులు చాలా వరకూ తగ్గుతాయి. ఈ ఆసనం వేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అలాగే ఒత్తిడి నుంచి కూడా మంచి రిలీఫ్ పొందవచ్చు. అంతర్గతంగా మనస్సు హెల్దీగా ఉంటుంది.
హిప్స్ కి బలం:
కొంత మందికి హిప్స్ అనేవి బలహీనంగా ఉంటాయి. ఇలాంటి వారు ఈ ఆసనం వేయడం వల్ల హిప్స్ బలంగా మారతాయి. అంతే కాదు.. తొడ కండరాల్లో ఫ్యాట్స్ ఉన్నా కరుగుతుంది.
కండరాలు స్ట్రాంగ్ గా ఉంటాయి:
చాలా మందికి కాళ్లు, చేతుల్లోని కండరాలు బలహీనంగా ఉంటాయి. ఇలాంటి వారు సీతాకోక చిలుక ఆసనం చేయడం వల్ల బలంగా, దృఢంగా మారతాయి.
గర్భిణీలకు ఎంతో మంచిది:
సీతాకోక చిలుక ఆసనం గర్భిణీలకు ఎంతో మంచిది. ఈ ఆసనం వేయడం వల్ల తొడ కండరాలు, నడుము స్ట్రాంగ్ గా మారి సులభంగా ప్రసవం అయ్యేలా హెల్ప్ అవుతుంది. వైద్యులు కూడా ఈ ఆసనం వేసేందుకు రికమెండ్ చేస్తారు.
ఈ ఆసనం ఎలా వేయాలంటే?..
ముందుగా ఈ ఆసనం వేయడానికి ఒక మ్యాట్ పై ప్రశాంతంగా కూర్చోవాలి. ఇప్పుడు మీ రెండు కాళ్లను మోకాళ్ల వరకూ తీసుకు రావాలి. ఆ తర్వాత రెండు పాదాలను ఒక దగ్గరకు చేర్చాలి. అరి కాళ్లను రెండు చేతులు పట్టుకుని సీతాకోక చిలుక రెక్కలు ఆడించినట్టు చేయాలి. పైన ఫొటోలో చూపించిన మాదిరిగా కూర్చోవాలి.
గమనిక: ఇది ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో చేసే ముందు నిపుణులను సంప్రదించండి.