Arjuna Tree Benefits: రోజూ ఈ పొడి తినండి.. జీవితంలో హార్ట్ ఎటాక్ అనేది రాదు!!

|

Sep 06, 2023 | 7:49 PM

ఇప్పుడు ఎక్కడ చూసినా.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ గుండె పోటుకు గురవుతున్నారు. చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ తో మరణిస్తూండటం అందర్నీ కలిచివేస్తుంది. మాట్లాడుతూ.. నడుస్తూ.. పని చేస్తూ ఉంటూనే ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. మంచి, చెడు మాట్లాడే సమయం కూడా ఉండటం లేదు. ఎంత ఫిట్ గా ఉంటున్నా కూడా ఈ సమస్యలు రోజు రోజుకూ తీవ్రతరం అవుతున్నాయి. సెలబ్రిటీలు సైతం చిన్న ఏజ్ లోనే గుండె పోటుతో మరణిస్తున్నారు. హార్ట్ ఎటాక్ కి అనేక రకరకాల కారణాలు ఉంటాయని..

Arjuna Tree Benefits: రోజూ ఈ పొడి తినండి.. జీవితంలో హార్ట్ ఎటాక్ అనేది రాదు!!
Heart Attack
Follow us on

ఇప్పుడు ఎక్కడ చూసినా.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ గుండె పోటుకు గురవుతున్నారు. చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ తో మరణిస్తూండటం అందర్నీ కలిచివేస్తుంది. మాట్లాడుతూ.. నడుస్తూ.. పని చేస్తూ ఉంటూనే ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. మంచి, చెడు మాట్లాడే సమయం కూడా ఉండటం లేదు. ఎంత ఫిట్ గా ఉంటున్నా కూడా ఈ సమస్యలు రోజు రోజుకూ తీవ్రతరం అవుతున్నాయి. సెలబ్రిటీలు సైతం చిన్న ఏజ్ లోనే గుండె పోటుతో మరణిస్తున్నారు. హార్ట్ ఎటాక్ కి అనేక రకరకాల కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

అతిగా తినడం, పొగ త్రాగడం, మద్యం సేవించడం, సరైన నిద్ర లేకపోవడం, రోజూ ఒకే చోట కూర్చొని ఉండం, ఆందోళనకు గురవ్వడం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్ తినడం ఇలా ఒక్కటేంటి.. గుండె పోటుకు చాలా కారణాలు ఉంటున్నాయి. గతంలో 50 ఏళ్లు పైబడిన వారు మాత్రమే హార్ట్ ఎటాక్ కు గురయ్యేవారు. కానీ ఇప్పుడు 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సువారికి కూడా గుండె పోటులు వస్తున్నాయి. గుండె ఆరోగ్యంపై సరైన శ్రద్ధ చూపించకపోవడం వల్లనే.. ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

అయితే అర్జున చెట్టు బెరడును రోజూ తీసుకుంటే.. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. దీంతో జీవితంలో గుండెకు సంబంధించిన సమస్యలు చాలా వరకు రావని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ అర్జున చెట్టు బెరడు.. ఆయుర్వేద షాపుల్లో విరివిగా లభిస్తుంది. లేదా చెట్టు బెరడు అందుబాటులో ఉన్నా వాడుకోవచ్చు. ఈ అర్జున చెట్టు బెరడు లేదా పొడిని ఒక గ్లాస్ పాలలో వేసి బాగా మరిగించాలి. అనంతరం ఈ నీటిని తాగితే హార్ట్ ఎటాక్ లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

అలాగే రాత్రంతా ఈ పొడి లేదా బెరడును నీళ్లలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం అయినా తాగవచ్చు. ఈ విధంగా అర్జున చెట్టు బెరడును తీసుకోవడం వల్ల గుండె సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం గుండె సమస్యలే కాదు.. ఇతర అనారోగ్య సమస్యలను కూడా దరి చేరకుండా చేస్తుంది. బీపీని కంట్రోల్ లో ఉంచుతుంది. అస్తమా, దగ్గు కూడా తగ్గుతాయి. చర్మ సమస్యలు కూడా రావు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి