మనం తినే నట్స్ లోకి గుమ్మడికాయ విత్తనాలు కూడా చేరిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా నట్స్ లో ఒక భాగం చేశారు. గుమ్మడికాయ లాగే గుమ్మడి కాయ విత్తనాలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిని కూడా ఆహారంలో ఒక భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటీని క్రమం తప్పకుండా తింటే నిద్రలేమి సమస్యలు, చర్మం, జుట్టు సమస్యలు తగ్గుతాయి. గుమ్మడికాయ విత్తనాల్లో ఉన్న పోషకాలు ఏంటి? వాటి వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు దాగి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పురుషుల్లో ప్రోస్టేట్ గ్రంథి మెరుగుపడుతుంది:
రోజూ గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల పురుషుల్లో ఉండే ప్రోస్టేట్ గ్రంథి పని తీరును మెరుగు పరుస్తుంది. దీంతో ప్రోస్టేట్ కాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు రాకుండా చేయడంలో హెల్ప్ చేస్తుంది.
కండరాల ఆరోగ్యం:
గుమ్మడి కాయల్లో ఉండే మెగ్నీషియం.. కండరాల పనితీరును మెరుగు పరుస్తుంది. తద్వారా కండరాల తిమ్మిర్లు వంటివి ఉండవు. అలాగే కండరాల ఆరోగ్యం కూడా బాగుంటుంది.
శరీరంలో ఇన్ ఫ్లామేషన్ తగ్గుతుంది:
గుమ్మడి గింజనలు తీసుకోవడం వల్ల హర్మోన్ల సమతుల్యత వంటి సమస్యలు ఉండవు. మోనోపాజ్ దశలో ఉన్న స్త్రీలు గుమ్మడి గింజలను తీసుకుంటే.. ఈ దశలో వచ్చే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.
కంటి ఆరోగ్యం:
క్రమం తప్పకుండా గుమ్మడి కాయ విత్తనాలను తింటే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే వయసు పైబడటం వల్ల వచ్చే ఐ ప్రాబ్లమ్స్ కూడా రావు. ఈ విత్తనాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటీన్, విటమిన్ ఇ కంటి ఆరోగ్యాన్ని పెంచుతాయి.
జీర్ణ క్రియ సాఫీగా:
ఈ విత్తనాలను తినడం వల్ల జీర్ణ క్రియ సాఫీగా సాగుతుంది. అలాగే పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి.
గుండె ఆరోగ్యంగా:
ఈ గుమ్మడి కాయ గింజలను తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలలు అదుపులో ఉంటాయి. గుండె కూడా ఆరోగ్యంగా పని చేస్తుంది. రక్త పోటు అదుపులో ఉంటుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి