Morning Tiffin: మీరు టిఫిన్‌ను స్కిప్ చేస్తున్నారా.! తస్మాత్ జాగ్రత్త.. ఇక మీకు అంతే సంగతులు..!!

|

Feb 21, 2021 | 10:30 PM

Morning Tiffin: స్మార్ట్ యుగంలో చాలామంది యువత పనుల హడావుడి, అలసత్వంతో ఉదయం పూట టిఫిన్‌ను ఎగ్గొడుతుంటారు. అలాగే రాత్రి సమయాల్లో..

Morning Tiffin: మీరు టిఫిన్‌ను స్కిప్ చేస్తున్నారా.! తస్మాత్ జాగ్రత్త.. ఇక మీకు అంతే సంగతులు..!!
Follow us on

Morning Tiffin: స్మార్ట్ యుగంలో చాలామంది యువత పనుల హడావుడి, అలసత్వంతో ఉదయం పూట టిఫిన్‌ను ఎగ్గొడుతుంటారు. అలాగే రాత్రి సమయాల్లో కూడా డిన్నర్ లేట్‌‌గా చేస్తుండటం కామన్ అయిపొయింది. అయితే ఇలా ప్రొద్దున్న బ్రేక్‌ఫాస్ట్‌ను మిస్ చేయడం.. నైట్ ఆలస్యంగా భోజనం చేయటం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని నిపుణులు తేల్చి చెబుతున్నారు.

చద్దన్నం, ఇడ్లీ, దోశ, వడ, బ్రెడ్ టోస్ట్, ఆమ్లెట్, ఉడకపెట్టిన కూరగాయలు, ఫ్రూట్స్.. ఇలా చాలామంది చాలా రకాలుగా తమకు నచ్చినవి ప్రొద్దున్న టిఫిన్‌గా తింటుంటారు. అయితే ఈ స్పీడ్ యుగం వల్ల చాలాసార్లు బ్రేక్‌ఫాస్ట్‌ను ఎగ్గొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇకపై ఇలా ఉదయం టిఫిన్‌ చేయకపోవడం, రాత్రి లేటుగా భోజనం చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయని పరిశోధకులు అంటున్నారు. అంతేకాకుండా హార్ట్ పేషెంట్స్ ఈ విధంగా చేస్తే మాత్రం వాళ్ళు తొందరగా చనిపోయే ఛాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయని ఓ పరిశోధనలో తేలింది.

ఇలా రెండు పూట్ల సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల తొందరగా మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు. దాదాపు 60 ఏళ్ళ వయసు ఉన్న 113 మంది హార్ట్ పేషెంట్స్‌ను పరీక్షించిన సైంటిస్టులు.. వారి రోజువారీ అలవాట్ల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నారు. వీరిలో టిఫిన్ తినని వారు 58 శాతం ఉండగా.. రాత్రి పూట భోజనం లేటుగా చేసేవారు 51 శాతం ఉన్నారు. అంతేకాకుండా ఈ రెండు చెడలవాట్లు కలిగిన వారు 48 శాతం మంది ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళే అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారని కూడా స్పష్టమైంది.

Also Read: Viral Video: భార్య చిలిపి ముద్దు.. ఆగ్రహించిన భర్త.! జూమ్ మీట్‌లో ఫన్నీ రొమాన్స్.. నెటిజన్లు ఫిదా..