ఇడ్లీ, ఆవిరి కుడుం లాంటి అల్పాహారాలు తప్పితే.. నూనె లేకుండా ఏ వంట కూడా పూర్తవ్వదు. కూరగాయలు లేదా మరేదైనా కిచెన్ సామాగ్రి అనుకోండి.. ధరలు పెరిగితే వాటిని కొన్ని రోజులు పక్కనపెట్టొచ్చు. అవసరం అయితే పచ్చడి నూరుకుని నడిపించేయొచ్చు. అయితే ఆ పచ్చడి తాలింపు పెట్టాలన్నా సరే.. నూనె వాడాల్సిందే. ధరలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నా సరే.. వంట నూనె కొనుగోలు చేయాల్సిందే. అయితే ఇప్పుడు జనాలకి ఉన్న పెద్ద టెన్షన్… నకిలీ నూనెలు మార్కెట్లో విపరీతంగా సర్కులేట్ అవుతూ ఉండటం. వీటి వల్ల సామాన్యుల జేబులు ఖాళీ అవ్వడమే కాదు.. ఆరోగ్యాలు కూడా దెబ్బతింటాయి. ఇప్పుడు కల్తీని ఎదుర్కోవడం మనకు పెద్ద సమస్యగా మారింది. ఈ క్రమంలో మనం అన్ని వంటల్లో వాడే వంట నూనె నిజంగానే మంచిదేనా ? లేక కల్తీదా అనేది తెలుసుకోవటం.. ఎలా..?. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పరిస్థితుల్లో చిన్న ప్రయోగం, చిట్కాల ద్వారా నూనె కల్తీదో లేదో తెలుసుకోవచ్చు.
వంట నూనెను కల్తీ చేయటానికి ప్రధానంగా పాస్పరస్ కలిగిన పెస్టిసైడ్‌లను వాడతారు. ముఖ్యంగా ట్రై ఆర్థో క్రెసిల్ ఫాస్ఫేట్ రసాయన వాడకం ఎక్కువగా ఉంటోంది. దీన్నీ కలపడం ద్వారా నూనె కల్తీ అవుతోంది. ఇలా కల్తీ అయిన నూనెను వాడటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తెలత్తుతాయి. ఈ రసాయన మన శరీరంలో ప్రవేశిస్తే నాడీవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా అనే భయంకరమైన వ్యాధులు కూడా రావొచ్చు. దీనికి సంబంధించిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఓ వీడియోను తయారు చేసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. మనం రోజు వాడే వంట నూనె కల్తీదో లేదో తెలియాలంటే ఇంట్లోనే చిన్న ప్రయోగం చేస్తే సరిపోతుంది. ఆ ప్రయోగ విధానాన్ని దిగువ వీడియోలో వీక్షించండి.
Detecting prohibited colour like metanil yellow Adulteration in Oil#DetectingFoodAdulterants_5#AzadiKaAmritMahotsav@jagograhakjago @mygovindia @MIB_India @PIB_India @MoHFW_INDIA pic.twitter.com/hFYqIwLHJ7
— FSSAI (@fssaiindia) September 8, 2021
ఈ సింపుల్ ట్రిక్‌తో మీరు వాడే నూనె మంచిదో, కాదో తెలుసుకోండి.
మొదటగా మనం వాడే 2 మిల్లీ లీటర్ల వంట నూనెను పాత్రలోకి తీసుకోండి. అందులో పసుపు రంగు ఉన్న వెన్నను వేయండి. ఒకవేళ పాత్రలో వంట నూనె రంగు మారితే అది కల్తీదని అర్థం. ఒకవేళ పాత్ర రంగులో ఎలాంటి మార్పు లేకపోతే వాడే నూనె స్వచ్చమైనదని విశ్వసించవచ్చు. పాత్రలోని వంట నూనె ఎరుపు రంగులోకి మారితే నూనెలో ట్రై ఆర్థో క్రెసిల్ ఫాస్ఫేట్ అనే రసాయనం ఉందని చెప్పువచ్చు.
Also Read: ఉదయాన్నే ఈ పదార్థాలు తీసుకుంటున్నారా.. అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్లే