Silent Heart Attack: నిశ్శబ్ద గుండెపోటు అంటే ఏమిటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి..?

|

Dec 29, 2021 | 3:31 PM

Silent Heart Attack: ఒక వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలిపోవడం, ఛాతి పట్టుకోవడం, కళ్ళు వెనక్కి తిప్పడం, తీవ్రమైన నొప్పితో మూలగడం మనం చూసి

Silent Heart Attack: నిశ్శబ్ద గుండెపోటు అంటే ఏమిటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి..?
Heart Attack
Follow us on

Silent Heart Attack: ఒక వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలిపోవడం, ఛాతి పట్టుకోవడం, కళ్ళు వెనక్కి తిప్పడం, తీవ్రమైన నొప్పితో మూలగడం మనం చూసి ఉంటాం లేదా విని ఉంటాం. కానీ ఇది నిజానికి చాలా అరుదుగా జరుగుతుంది. సాధారణంగా గుండెపోటు వేగంగా అనుకోకుండా వస్తుందని అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే ఇది నెమ్మదిగా కూడా వస్తుంది. దీనిని గుర్తించడం చాలా ముఖ్యం. నిశ్శబ్ద గుండెపోటు సూక్ష్మంగా ఉండటం వల్ల ప్రజలు దానిని గమనించలేరు. కానీ తరువాత అది జీవితానికి ఎంత ప్రమాదకరమో తెలుస్తుంది. ఈ పరిస్థితిలో నిశ్శబ్ద గుండెపోటు లక్షణాల గురించి తెలుసుకుందాం.

నిశ్శబ్ద గుండెపోటు అంటే ఏమిటి?
నిశ్శబ్దం చాలా ప్రమాదకరం. గుండె పనిచేయడానికి ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తం అవసరం కాబట్టి గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే ధమనులలో అడ్డుగా ఏదైనా ఏర్పడితే రక్త ప్రసరణ నిలిచిపోతుంది. గుండెకు రక్తప్రసరణ లేనప్పుడు ఎక్కువ నష్టం జరుగుతుంది. దీని కారణంగా నిశ్శబ్ద గుండెపోటు వచ్చే అవకాశాలు ఉంటాయి. దాని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

1: ఛాతీ నొప్పి, ఒత్తిడి, అసౌకర్యం, ఇవన్నీ కొన్నిసార్లు గుండెపోటు ముందు కనిపిస్తాయి. ఈ లక్షణాలుంటే ఇది నిశ్శబ్ద గుండెపోటు అని అర్థం చేసుకోవచ్చు. లేదంటే మీ ఛాతీ మధ్యలో కొంచెం నొప్పి లేదా అసౌకర్యంగా ఉంటుంది. దీని కారణంగా మీరు కొద్దిగా ఒత్తిడి, అసౌకర్యాన్ని అనుభవించవచ్చు. ఈ లక్షణాలు కనిపించినప్పుడు సాధారణంగా ఎవ్వరైనా నిర్లక్ష్యం చేస్తారు. ఇది తరువాత ప్రమాదకరంగా మారుతుంది.

2. మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే లేదా అకస్మాత్తుగా మైకం వస్తే నిర్లక్ష్యం చేయకూడదు. మీరు ఛాతీ నొప్పితో శ్వాస ఆడకపోవడాన్ని కలిగి ఉండవచ్చు. ఇది నిశ్శబ్ద గుండెపోటుకు సాధారణ సంకేతం. ఒక్కోసారి మీరు మైకంతో మూర్ఛపోవచ్చు.

3. జలుబు, చెమటలు, వికారం సైలెంట్ హార్ట్ ఎటాక్ లక్షణాలు కావచ్చు.సాధారణంగా ఈ లక్షణాలు ఫ్లూలో కనిపిస్తాయి కానీ ఫ్లూ చికిత్స తర్వాత కూడా ఉంటే తీవ్రంగా పరిగణించి వైద్యుడిని సంప్రదించాలి.

4. మీరు ఎప్పుడైనా ఏ విధంగానైనా అసౌకర్యంగా భావిస్తే ముందుగా గుండెపోటును నివారించడానికి గుండె పరీక్ష చేసుకోవడం ఉత్తమం.

AISSEE Admit card 2022: సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ అడ్మిట్‌ కార్డు విడుదల.. ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి..

Omicron: ఈ దేశంలో ఒమిక్రాన్‌ జాతీయ ముప్పు కాదు.. ఎటువంటి ఆంక్షలు లేవు.. ఎందుకంటే..?

NTA CMAT Registration 2022: CMAT పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ ఎప్పుడు..? తాజా అప్‌డేట్‌ తెలుసుకోండి..